భారత్‌లో బిగాస్ స్కూటర్లకు బుకింగ్స్ ప్రారంభం - ధరలు, వివరాలు
ముంబైకి చెందిన ప్రముఖ ఎనర్జీ కంపెనీ సంస్థ ఆర్ఆర్ గ్లోబల్ భారత ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్తగా ఆవిష్కరించిన స్కూటర్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన బి8 ఎల్ఐ టెక్నాలజీ, లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ వేరియంట్లు అలాగే ఏ2 లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ వేరియంట్ల కోసం కంపెనీ బుకింగ్‌లను స్వీకరిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్‌లు చేసుకోవాలనుకునే కస్టమర్లు ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.bgauss.com ను సందర్శించి, రూ.3,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇలా ఉన్నాయి:
* బి8 - లీడ్-యాసిడ్ ధర - రూ.62,999
* బి8 - లిథియం-అయాన్ ధర - రూ.82,999
* బి8 - ఎల్ఐ-టెక్ ధర - రూ.88,999
* ఎ2 - లీడ్-యాసిడ్ ధర - రూ.52,499
* ఎ2 - లిథియం అయాన్ ధర - రూ.67,999
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

ఈ రెండు-ప్రీమియం శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను (బిగాస్ బి8, బిగాస్ ఎ2) ఈ ఏడాది ఆగస్టు నుండి పూణే, నేవీ ముంబై, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరుల నగరాల్లో డెలివరీ చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లూయిడిక్ డిజైన్‌తో నడపటానికి సులువుగా, సౌకర్యంగా ఉండేలా, తక్కువ నిర్వహణ వ్యయంతో, అలాగే గొప్ప పవర్ మరియు క్విక్ ఛార్జింగ్, ఐఓటి వంటి అధునాత టెక్నాలజీతో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.

తొలగించదగిన బ్యాటరీ, యాంటీ-తెఫ్ట్ అలారం, యాంటీ-తెఫ్ట్ మోటర్ లాకింగ్, ఎల్‌ఇడి ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, మల్టీ-కలర్ డిజిటల్ డిస్‌ప్లే, డిఆర్‌ఎల్, కీలెస్ స్టార్ట్, ఫైండ్ యువర్ స్కూటర్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్, యుఎస్‌బి ఛార్జింగ్, రివర్స్ అసిస్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, 3 రైడింగ్ మోడ్స్ (లో, మీడియం, హై) వంటి ఫీచర్లతో బిగాస్ స్కూటర్ల లభ్యం కానున్నాయి. ఈ స్కూటర్లలోని ఐఓటి ఫీచర్ టెక్నాలజీతో ప్రతి స్కూటర్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్‌తో లభిస్తాయి.

బిగాస్ బి8 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఐ టెక్నాలజీతో వస్తుంది. ఇది లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులోని అన్ని వేరియంట్లు కూడా లో, మీడియం, హై అనే మూడు రైడింగ్ మోడ్‌లను సపోర్ట్ చేయనున్నాయి. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో నడుస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై లీడ్-యాసిడ్ వేరియంట్ 78 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది, లిథియం-అయాన్ మరియు ఎల్ఐ టెక్నాలజీ వేరియంట్లు 70 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి.

లీడ్-యాసిడ్ వేరియంట్ బ్యాటరీని 0-100 శాతం చార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇందులోని లిథియం-అయాన్ మరియు ఎల్ఐ టెక్నాలజీ వేరియంట్లు తొలగించగల బ్యాటరీతో వస్తాయి. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఈ బ్యాటరీలను గరిష్టంగా మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. బిగాస్ బి8 లిథియం-అయాన్ బ్లూటూత్ ఫీచర్‌లో లభ్యం కానుంది, ఇది బ్లూ, వైట్, రెడ్, గ్రే కలర్లలో లభిస్తుంది.

ఇకపోతే బిగాస్ ఏ2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది కూడా లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీలతో లభ్యం కానుంది. ఈ రెండు వేరియంట్లలో కూడా మూడు రైడింగ్ మోడ్స్ (లో, మీడియం హై) ఉంటాయి. ఈ మోడ్స్‌లో స్కూటర్ కనిష్టంగా టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ నుండి గరిష్టంగా 110 కిమీ వరకూ ఉంటుంది. లీడ్-యాసిడ్ బ్యాటరీని 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 7-8 గంటలు పడుతుంది, లిథియం-అయాన్ తొలగించగల బ్యాటరీతో వస్తుంది మరియు దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇది బ్లూ, వైట్, గ్రే కలర్లలో లభిస్తుంది.

బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ పరిణామాలు చూస్తుంటే, భారత్‌లో క్రమక్రంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. బిగాస్ విడుదల చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అద్భుతంగా కనిపిస్తాయి, భవిష్యత్ రవాణాను ఉద్దేశించి తయారు చేసిన ఈ వాహనాలు మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ట్రాక్షన్‌ను కలిగి ఉంటాయని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








