ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో పోటీ నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఈ విభాగంలో మరో దేశీయ కంపెనీ ప్రవేశించింది. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఇవి తమ సరికొత్త 'ఈట్రాన్స్+' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్తగా విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.56,999గా ఉంది.

ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.25 కిలోవాట్ల పోర్టబుల్ బ్యాటరీ ఉంటుందని, పూర్తి చార్జ్‌పై దీని రియల్ వరల్డ్ రేంజ్ 65 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్రేక్ రీజనరేషన్, ఈఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎస్ఓసి సూచిక కూడా ఉంటుంది, ఇది బ్యాటరీలో మిగిలి ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ప్యూర్ ఈవి అనేది దేశంలో ఈవీ స్టార్టప్ కంపెనీ, దీనికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. ఈ సంస్థలో అంతర్గత బ్యాటరీ తయారీ సౌకర్యం మరియు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఆధారంగా ఒక రీసెర్చ్ సెటప్ కూడా ఉంది.

MOST READ:భారత్‌లో రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కంపెనీకి బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యొక్క ప్రధాన ప్రాంతాలపై పనిచేసే ప్రత్యేక ఆర్ అండ్ డి బృందం కూడా ఉంది. భవిష్యత్తులో అనేక కొత్త మోడళ్లకు దారితీసే దీర్ఘ-శ్రేణి మరియు అధిక-పనితీరు గల లిథియం బ్యాటరీలను అభివృద్ధి చేయడం ఈ ఆర్ అండ్ డి లక్ష్యం.

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ప్యూర్ ఈవి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వాదెరా మాట్లాడుతూ, "ఈ కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో వ్యక్తిగత రవాణాపై డిమాండ్ గణనీయంగా పెరిగింది మరియు ప్రజలు కూడా సరసమైన ధరలకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చూస్తున్నార"ని అన్నారు.

MOST READ:భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"ఈట్రాన్స్+ ఒక బలమైన ఛాస్సిస్ డిజైన్‌తో భారతీయ రహదారి పరిస్థితుల కోసం నిర్మించిన శరీర భాగాలు మరియు బ్రేక్ రీజనరేషన్, ఈఏబిఎస్, ఎస్ఓసి ఇండెక్స్ వంటి అధునాతన ఫీచర్లతో లభిస్తుంది. ఇందులోని ఎస్ఓఎస్ ఫీచర్ మిగిలిన బ్యాటరీ సామర్థ్య శాతాన్ని చూపిస్తుంది. ఈ మోడల్ రోజువారీగా చేసే చిన్న ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుందని" ఆయన చెప్పారు.

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ప్యూర్ ఈవి వ్యవస్థాపకుడు నిశాంత్ డోంగారి మాట్లాడుతూ, "ఈట్రాన్స్+ స్కూటర్‌ను ప్రారంభించడం సంస్థకు మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. వినియోగదారుల విషయంలో అన్ని ముఖ్య అంచనాలను అందుకునేలా, ఖర్చు నిర్వహణతో తయారు చేసిన ఈ స్కూటర్ మా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మా అంతర్గత బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్ అండ్ డి బృందం సాయంతో ప్రస్తుత మహమ్మారి సమయంలో కూడా ఇటువంటి ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయని" అన్నారు.

MOST READ:కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"వచ్చే 2020 డిసెంబరు నాటికి హై-స్పీడ్ వేరియంట్‌ను విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నాము. ఇది 90 కిలోమీటర్ల ఆన్-రోడ్ రేంజ్ మరియు 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో రాబోతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.69,999గా ఉంటుందని" ఆయన అన్నారు.

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో నాలుగు ఉత్పత్తులను విడుదల చేసింది. అవి - ఈప్లూటో 7జి, ఈప్లూటో, ఈట్రాన్స్ మరియు ఇట్రాన్+. ఈ కంపెనీ తమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం రెండు లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీ తయారీ సామర్థ్యం 5 గిగావాట్స్‌గా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడండి

ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కంపెనీ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 20,000 ఈవిలు మరియు బ్యాటరీ సామర్థ్యం 0.5 గిగావాట్‌గా ఉంది. ప్యూర్ ఈవి 2021 నాటికి ప్రారంభించగలిగే రెండు లక్షల చదరపు అడుగుల ఉత్పత్తి సౌకర్యాన్ని పరిశీలిస్తోంది. ఇది భారతీయ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు లిథియం బ్యాటరీ మార్కెట్లలో ఊహించిన వృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది.

ప్యూర్ ఈవి కొత్తగా ప్రారంభించిన ప్యూర్ ఈవి ఈట్రాన్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇప్పటి వరకు మనకు తెలిసిన దాని ప్రకారం, ఇది బ్రేక్ రీజనరేషన్, ఈఏబిఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన లో-స్పీడ్స లో-రేంజ్ స్కూటర్ అని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Indian electric two-wheeler manufacturer, Pure EV has launched the ETrance+ scooter in the Indian market. The newly launched scooter is priced at Rs 56,999. The complete details of the scooter are yet to be revealed by the company. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X