'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

భారతదేశంలో రోజు రోజుకి స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు పోలీసులు మహిళల యొక్క భద్రతను ప్రోత్సహించడానికి మహిళా బైక్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం!

 'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

బెంగళూరు నగరాన్ని మహిళలకు మరియు పిల్లలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో బెంగళూరు పోలీసులు 'వి ఫర్ ఉమెన్' అనే మహిళా పోలీసు మోటారుసైకిల్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేశారు.

 'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

'వి ఫర్ ఉమెన్'లో భాగంగా ఇప్పటికి 15 మంది లేడీ సబ్-ఇన్స్పెక్టర్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా మోటారుసైకిలిస్టుల బృందాన్ని పెంచుకుంటున్నారు. పోలీస్ మహిళను ఉదాహరణలుగా చూపించి ఇతర మహిళలను కూడా ప్రేరేపించాలని ఆశిస్తున్నామని పోలిస్ ప్రధాన కార్యాలయ జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దివ్య సారా థామస్ పేర్కొన్నారు.

 'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

బైక్ రైడింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న మహిళా పోలీసులను గుర్తించి వారిని వివిధ పరిస్థితులలో వారి యొక్క రైడింగ్ నైపుణ్యాలను మెరుగుపరచటానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శిక్షణ ఇవ్వడం వల్ల కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులలో బయటపడటానికి అనుకూలంగా ఉంటుంది.

 'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

బైక్ రైడింగ్లు మరింత విస్తరించినట్లైతే పోలీసులు పెట్రోలింగ్ విధులను నిర్వహించడానికి కూడా ఉపయోగ పడుతుంది. ఈ విధంగా మహిళా పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ఇక్కడ స్త్రీ, పురుష లింగ బేధం తొలగిపోతుంది అని థామస్ పేర్కొన్నారు.

'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

'వి ఫర్ ఉమెన్' లో భాగంగా రెండు దశల్లో శిక్షణ పొందిన మహిళా పోలీసులు హిమాలయన్, ఇంటర్‌సెప్టర్ 650, క్లాసిక్ 350 వంటి బుల్లెట్ వంటి మోడళ్లను కూడా రైడింగ్ చేయడం నేర్చుకున్నారు.

'వి ఫర్ ఉమెన్' బైక్ బ్రిగేడ్‌ను ప్రారంభించిన బెంగళూరు పోలీసులు!

మహిళా రైడర్లు నగర సాయుధ రిజర్వ్ ప్రధాన కార్యాలయం నుండి నంది హిల్స్ వెళ్లేందుకు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు ఫ్లాగ్ ఊపి మహిళా పోలీసులతో కలిసి బుల్లెట్‌లో ప్రయాణించడం జరిగింది. మహిళా పోలీసులకు బైక్ రైడింగ్లు నేర్చుకోవడం వల్ల అధికార నిర్వహణ మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితులలో కూడా చాలా ఉపయోగపడుతుంది.

Source: Bangalurucity/Twitter

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2020, 14:37 [IST]
English summary
Bengaluru Police Form All Women Bike Team To Promote Female Safety. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+