హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

ఇటీవల కాలంలో మాడిఫైడ్ వాహనాలను ఉపయోగించడానికి వాహనదారులు ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ విధమైన ఆసక్తి కారణంగా ఈ మధ్య కాలంలో చాల వరకు మాడిఫైడ్ వాహనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపొందింది. మాడిఫైడ్ హార్లే డేవిడ్సన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

చాలా మంది వినియోగదారులు హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ బైక్ ని సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ బైక్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని మాడిఫై చేసి హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపొందించారు.

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

మాడిఫై చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చూడటానికి హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాగ కనిపిస్తుంది. కాని బయటకి ఇది హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా కనిపించినప్పటికీ దీని లోపల మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పరికరాలు ఉంటాయి. ఈ విధంగా మాడిఫై చేసిన ఈ బైక్ కోసం చాలా ఖర్చు చేసినట్లు మనకు తెలుస్తుంది.

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

మాడిఫై చేసిన ఈ బైక్ లో బుల్లెట్ మోటార్ అమర్చడం జరిగింది. కస్టమర్ యొక్క అవసరకు అనుకూలంగా తయారు చేసిన ఈ బైక్ లో కొన్ని భాగాలు చేతితోనే తయారుచేయబడ్డాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అప్‌గ్రేడ్ చేసిన ఎగ్జాస్ట్‌ వల్ల ఇది ఫ్యాట్ బాయ్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది బుల్లెట్ ఇంజిన్‌ను ప్యాక్ ని కలిగి ఉంటుంది. కాబట్టి పనితీరు కూడా బుల్లెట్‌తో సమానంగా ఉంటుంది.

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

బుల్లెట్ ప్రస్తుతం 500 సిసి మరియు 350 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుండగా, ఫ్యాట్ బాయ్ 1745 సిసి ట్విన్ సిలిండర్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65 హెచ్‌పి గరిష్ట శక్తిని, 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 144 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్ 346 సిసి సింగిల్ సిలిండర్ ని కలిగి ఉంటుంది. ఇది 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 19.8 హెచ్‌పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరో వైపు బుల్లెట్ 500 బైక్ 499 సిసి మోటరుతో వస్తుంది. ఇది 5,250 ఆర్‌పిఎమ్ వద్ద లభించే 27.2 హెచ్‌పి శక్తిని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 41.3 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం ఏప్రిల్ 1నుంచి అన్ని వాహనాలు బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయాలి. కాని చెన్నైకి చెందిన తయారీదారు తన 500 సిసి బైకులను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబోమని ధ్రువీకరించింది.

బిఎస్-6 అడగరు నిభందనలకు అనుకూలంగా తయారు చేయకపోవడం వల్ల 500 సిసి బైకులు త్వరలో నిలిపివేయనున్నారు. మార్కెట్లో ఈ సిసి బైకుల ధరలను గమనించినట్లయితే బుల్లెట్ 500 ప్రస్తుత ధర రూ. 1.86 లక్షలు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్).

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గా రూపాంతరం చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇటీవల కాలంలో చాలా వరకు మాడిఫైడ్ చేసిన బైకులు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల ఆసక్తికి నిలువెత్తు నిదర్శనం. మాడిఫైడ్ చేయబడిన ఈ బైకులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ చూడటానికి అచ్చం "హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్" లాగే ఉంటుంది.

Image Courtesy: Vampvideo/YouTube

Most Read Articles

English summary
Royal Enfield Bullet Transformed Into A Harley Davidson Fat Boy. Read in Telugu.
Story first published: Thursday, March 12, 2020, 15:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X