షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్, క్లాసిక్ 350 మోడల్‌ను బిఎస్-6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధరను 1.65 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా నిర్ణయించారు.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

బిఎస్4 మోడల్‌తో పోల్చుకుంటే బిఎస్6 మోడల్ క్లాసిక్ 350 ధర రూ. 11,000 వరకు పెరిగింది. ఎన్నో అప్‌డేట్స్, అత్యాధునిక ఫీచర్లు, పెయింట్ స్కీమ్ మరియు ఇంజన్‌ అప్‌డేట్స్‌తో వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బిఎస్-6 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో వచ్చిన కీలక అప్‌డేట్ బిఎస్-6 ఇంజన్. అదే 346సీసీ పాత ఇంజనే వచ్చినప్పటికీ, బిఎస్4తో పోల్చుకుంటే బిఎస్6 ఇంజన్ తక్కువ ఉద్గారాలు (కాలుష్య కారకాలు) విడుదల చేస్తుంది. ఏప్రిల్ 01, 2020 నుండి ప్రతి ఇంజన్ కూడా బిఎస్6 ప్రమాణాలకు పాటించాలని కేంద్రం ప్రకటించింది.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

సాంకేతికంగా బిఎస్6 వెర్షన్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులోని 346సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో కూడా అదే మునుపటి 5-స్పీడ్ గేర్‌బాక్స్ యధావిధిగా వచ్చింది.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

బిఎస్6 వెర్షన్‌లో వచ్చిన మరో కీలకమైన అప్‌డేట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, మునుపటి మోడల్‌లో ఉండే కార్బోరేటర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ (FI) వచ్చింది. కఠినమైన బిఎస్6 ఉద్గార ప్రమాణాలను పాటించడం కార్బోటర్ సిస్టమ్‌తో సాధ్యం కాదు. మెరుగైన పవర్ అవుట్‌పుట్ మరియు ఫ్యూయల్ లాస్ అరికట్టడంలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఎంతగానో సహాయపడుతుంది.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

ఇప్పటి వరకు స్పోక్ వీల్స్‌తో మాత్రమే లభించే క్లాసిక్ 350 ఇప్పుడు అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తుంది. అదనంగా స్టెల్త్ బ్లాక్ మరియు క్రోమ్ బ్లాక్ అనే రెండు విభిన్న పెయింట్ స్కీమ్స్ కూడా పరిచయం అయ్యాయి. వీటితో బ్లూ, శాండ్, గన్‌మెటల్ గ్రే మరియు క్లాసిక్ బ్లాక్ అనే నాలుగు స్టాండర్డ్ కలర్ ఆప్షన్లలో దీనిని ఎంచుకోవచ్చు.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బిఎస్6 వెర్షన్ బుకింగ్స్ ఇదివరకే స్టార్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏదేని రాయల్ ఎన్ఫీల్డ్ అధీకృత డీలర్ వద్ద రూ. 10,000 టోకెన్ అమౌంట్ చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

క్లాసిక్ 350 బిఎస్6 వెర్షన్‌ విడుదలతో పాటు తమ పాపులర్ మోడళ్లయిన క్లాసిక్, బుల్లెట్ మరియు థండర్‌బర్డ్ సిరీస్ బైకులను 2020 మధ్య భాగానికి కల్లా న్యూ జనరేషన్‌లో ప్రవేశపెడుతున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు పాత డిజైన్, ఇంజన్ సౌండ్ మరియు వాటి బరువుకు పెట్టింది బరువు. అయితే యువ మరియు లేడీ కస్టమర్ల కోసం తక్కువ బరువు ఉండేలా ఎక్స్‌ప్లోర్ (Explore) అనే న్యూ బ్రాండ్ పేరుతో లైట్ వెయిట్ బైకులను విడుదల చేస్తామని కూడా పేర్కొంది.

షాకింగ్ ధరతో విడుదలైన బిఎస్-6 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ కలిగిన మోడల్. నెలవారీ సేల్స్ టార్గెట్ పూర్తి చేస్తున్న ఏకైక మోడల్ కూడా ఇదే. మార్కెట్లో ఉన్న జావా బైకులు మరియు బెనెల్లీ ఇంపీరియాల్ 400 మోడల్‌కు గట్టి పోటీనిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2020, 14:35 [IST]
English summary
Royal Enfield Classic 350 BS-VI Launched In India: Prices Start At Rs 1.65 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+