రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఎంతో మంది యువత యొక్క డ్రీమ్ బైక్, కాబట్టి డ్రీమ్ బైక్ కొనేటప్పుడు చాలా ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అందులో ప్రధానం వెర్షన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ (ఇయర్ మోడల్). మీరు గనుక ఈ ఏడాదిలో క్లాసిక్ 350 బైక్ తీసుకోవాలనుకుంటుంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

చెన్నైకు చెందిన దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ పాపులర్ బైక్ క్లాసిక్ 350 మోడల్‌ను బిఎస్-6 వెర్షన్‌లో నేడు విపణిలోకి లాంచ్ చేయనుంది. ఇప్పటి వరకు బిఎస్-4 ఇంజన్‌తో లభించే ఈ బైక్ ఇకపైన బిఎస్-6 ఇంజన్‌తో రానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

బిఎస్-6 ఇంజన్‌తో వచ్చే రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ 350 బైకులన్నీ కూడా 2020 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్‌తోనే లభిస్తాయి. అంటే వీటి మోడల్ ఇయర్ 2020 ఉంటుందన్నమాట. లేటెస్ట్ మోడల్ ఇయర్ ఉండటం ద్వారా రీసేల్ వ్యాల్యూ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ మోడల్‌నే ఎంచుకోవడం బెస్ట్.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

నేడు (జనవరి 07, 2020) విడుదల కానున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో లేటెస్ట్ బిఎస్-6 ఇంజన్‌తో పాటు పలు మార్పులు కూడా జరిగాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ ఇందులో వచ్చిన ప్రధాన మార్పుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కార్బోరేటర్ ఫ్యూయల్ సిస్టమ్ ఉండటంతో ఆశించిన మైలేజ్ రాకపోగా.. రైడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునేవారు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

బిఎస్-6 క్లాసిక్ 350 సరికొత్త పెయింట్ స్కీమ్‌లో పరిచయం కానుంది. ఇప్పటి వరకు స్పోక్ వీల్స్ మాత్రమే లభించే క్లాసిక్ 350, ఇప్పుడు అల్లాయ్ వీల్స్ కూడా వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, క్రోమ్ ఎలిమెంట్స్ మరియు స్పోక్ వీల్స్ కూడా యధావిధిగా రానున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

బిఎస్-4 ప్రమాణాలతో లభిస్తున్న క్లాసిక్ 350 ప్రస్తుతం మోడల్‌లో 346సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

అయితే బిఎస్-6 వెర్షన్‌లో కూడా 346సీసీ ఇంజనే వస్తుంది, అయితే భారత రవాణా శాఖ తప్పనిసరి చేసిన బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. కర్బన్ ఉద్గారాలు తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన బిఎస్-6 ప్రమాణాల కారణంగా మునుపటి వెర్షన్ కంటే ఈ బిఎస్-6 వెర్షన్ పవర్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బిఎస్-4 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉంది. బిఎస్-6 వెర్షన్ క్లాసిక్ 350 పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే దీని ధర సుమారుగా రూ. 10,000 వరకూ పెరిగే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

బిఎస్-6 వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వెర్షన్ కోసం వెయిట్ చేసి దీనినే ఎంచుకోవడం బెస్ట్ అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. మెరుగైన ఇంజన్, కొత్త మార్పులు మరియు పాత వెర్షన్‌తో పోల్చుకుంటే అత్యంత మెరుగ్గా ఉంటుందని అభిప్రాయం.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

రాయల్ ఎన్పీల్డ్ బిఎస్-6 వెర్షన్ క్లాసిక్ 350 మోడల్ మీద ఇప్పటికే 10,000 రూపాయలతో బుకింగ్స్ కూడా ప్రారంభించారు. అంతే కాకుండా ఇటీవల వచ్చిన వార్తలను గమనిస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ తమ బుల్లెట్, క్లాసిక్, థండర్‌బర్డ్ మరియు హిమాలయన్ మోడళ్ల మీద బేసిక్, బేసిక్ ప్లస్ మరియు ప్రీమియం అనే మూడు రకాల రైడ్ ఫర్ ష్యూర్ అనే వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్లు తెలిసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

బేసిక్ ప్లాన్‌లో 2 ఏళ్ల వారంటీని 4 ఏళ్లకు పొడగించారు, కానీ గరిష్టంగా 50,000 కిలోమీటర్లకు పరిమితిని విధించారు. బేసిక్ ప్లస్ ప్యాకేజీలో వారంటీ 2 ఏళ్లు పెరిగడంతో పాటు రెండు, మూడు మరియు నాలుగో ఏడాది వరకు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ లభిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

ప్రీమియం ప్లాన్‌లో పైన పేర్కొన్న వారంటీతో పాటు బ్రేక్ ప్యాడ్స్, యాక్సిలరేటర్ కేబుల్స్ మరియు క్లచ్ వైర్లను నాలుగేళ్ల లోపు లేదా 50,000 కిలోమీటర్ల లోపు ఏది ముందైతే దానికి అనుగుణంగా ఉచితంగా రీప్లేస్ చేస్తారు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

రైడ్ ఫర్ ష్యూర్ వారంటీ ప్లాన్ కింద బైకులోని ఇంజన్ సిలిండర్ హీట్, ఫ్యూయల్ ట్యాంక్, ఫుష్-రాడ్ కిట్, ఇంజన్ బ్లాక్ అసెంబ్లీ, కార్బోరేటర్, అన్ని సెన్సార్లు, గేర్‌బాక్స్, మ్యాగ్నెట్ కవర్, సబ్-ఫ్రేమ్, ఇంజన్‌లోని పిస్టన్ మరియు కనెక్టిట్ రాడ్ అసెంబ్లీ వంటి అతి ముఖ్యమైన బాడీ పార్ట్స్ మీద కూడా వారంటీ లభిస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

కంపెనీ పాలసీ ప్రకారం రోడ్డు ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల కారణంగా వారంటీలోని ఏదైనా పార్ట్స్ డ్యామేజ్ అయితే వారంటీ వర్తించదు, సహజంగా పాడయ్యే పార్ట్స్‌కు మాత్రమే రైడ్ ఫర్ ష్యూర్ వారంటీ ప్లాన్‌లో రీప్లేస్/రిపేర్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహించే సర్వీస్‌ పార్ట్స్ అయినటువంటి ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ మరియు కన్స్యూమబుల్ పార్ట్స్ మీద వారంటీ వర్తించదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హుందాతనం మరియు రోడ్డు మీద చక్కటి గంభీరత్వాన్ని ప్రదర్శించే డిజైన్ మరియు ఇంజన్ పవర్ క్లాసిక్ 350 మోడల్‌ సక్సెస్‌కు ప్రధాన కారణం. అయితే, సాంకేతిక లోపాలు, నూతన టెక్నాలజీ లేమి మరియు వైబ్రేషన్స్ కారణంగా కొందరు దీన్ని ఇష్టపడరు. ఏదేమైనప్పటికీ, బిఎస్6 వెర్షన్‌లో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం అవకాశం ఉంది. ఇది నిజమైతే జరిగితే క్లాసిక్ 350 సేల్స్‌కు తిరుగుండదనే చెప్పాలి, ఏప్రిల్ 01, 2020 నుండి రిజిస్ట్రేషన్‌కు వెళ్లే ప్రతి బైకు/కారులో బిఎస్-6 ఇంజన్ తప్పనిసరి కావడంతో గడువుకు ముందే అన్ని కంపెనీలు తమ వాహనాల్లో బిఎస్6 ఇంజన్‌ను అందిస్తున్నాయి.

Most Read Articles

English summary
Royal Enfield Classic 350 BS6 To Launch In India On 7 January: Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X