క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల కాలంలోనే ఇండియన్ మార్కెట్లో తన 500 సిసి మోడల్ ఉత్పత్తిని ముగించినట్లు ప్రకటించింది. క్లాసిక్, బుల్లెట్ మరియు థండర్బర్డ్ సహా 499 సిసి ఇంజిన్‌తో అన్ని మోడళ్ల ఉత్పత్తిని కంపెనీ ముగించనుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ ఫిబ్రవరి 10 న భారతదేశంలో అమ్మకం కానున్నట్లు ప్రకటించింది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

ఇండియన్ మార్కెట్లో క్లాసిక్ 500 కోసం బుకింగ్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ అమ్మకం ఫిబ్రవరి 10 న మాత్రమే పరిమిత సంఖ్యలో కస్టమర్లకు అందించడం జరుగుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో 499 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు అనుసంధానించబడి ఉండి, 27 బిహెచ్‌పి మరియు 41ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే లిమిటెడ్ ఎడిషన్, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో పాటు ప్రత్యేకమైన సీరియల్ నంబర్‌తో వస్తుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

భారతీయ మార్కెట్లో రాబోయే బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 500 సిసి ఇంజిన్‌ను అప్‌డేట్ చేసే ఆలోచన లేదు. ప్రస్తుతం ఇంటర్‌సెప్టర్ మరియు కాంటినెంటల్ జిటిలను కలిగి ఉన్న 650 సిసి శ్రేణిపై కంపెనీ ఎక్కువ దృష్టి పెడుతుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

650 సిసి మోడళ్లతో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ప్రసిద్ధ 350 సిసి సమర్పణలను కూడా అందిస్తోంది. 2020 ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలు చేయబోయే సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 350 సిసిని కంపెనీ ఇప్పటికే అప్‌డేట్ చేసింది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

350 సిసి మోడెల్లో, క్లాసిక్ 350 వారి ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్. ఇది ఇప్పటికే బిఎస్-6 ఉద్గారా నిబంధనలకు అనుగుణంగా నవీనీకరించబడింది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పుడు దాని బిఎస్-4 వెర్షన్ కంటే రూ. 11,000 అధికంగా ఉటుంది. అంటే ఇప్పుడు దీని ధర రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సిసి మరియు 350 సిసి మోడల్ తో పాటు, చెన్నైకి చెందిన బ్రాండ్ 411 సిసి ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో లభిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇటీవల బిఎస్ 6 అప్‌డేట్‌ను కూడా అందుకుంది. దీనితో పాటు కొత్త ఫీచర్లను మరియు కొత్త రంగులలో కూడా లభించనుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ భారతీయ మార్కెట్లో 500 సిసి మోడల్స్ పూర్తిగా నిలిపివేయబడటానికి ముందు మార్చి 31 వరకు అమ్మకానికి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Sunday, February 2, 2020, 9:00 [IST]
English summary
Royal Enfield Classic 500 Tribute Black Edition Revealed Ahead Of Launch: Bookings Now Open. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+