కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఆగ్నేయాసియాలోని కంబోడియా మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ తన అంతర్జాతీయ మార్కెట్‌ను మరింత విస్తరించింది. చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంబోడియాలో టిఎఫ్ మోటార్స్‌ను తన అధికారిక పంపిణీదారుగా నియమించింది.

కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

ఈ ఏడాది జూన్‌లో కంపెనీ కంబోడియా రాజధానిలో తొలి ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను ప్రారంభించింది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో బుల్లెట్ 500, క్లాసిక్ సిరీస్, ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైక్‌లను విక్రయిస్తుంది.

కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

కంబోడియాలో కాంటినెంటల్ జిటి ధర $ 6,431, అంటే సుమారు మన దేశీయ కరెన్సీ ప్రకారం రూ. 4.82 లక్షలు. బైక్‌లతో పాటు కంపెనీ ప్రొటెక్టివ్ రైడింగ్ గేర్, ఆక్సెససరీస్, క్లాత్స్ మరియు ఇతర వస్తువులను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌లలో విక్రయిస్తున్నారు.

MOST READ:ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి ఇటీవల కాలంలో ఆగ్నేయాసియా మార్కెట్ లో కూడా ఎక్కువ డిమాండ్ పెరిగింది. 2019 లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త అసెంబ్లీ యూనిట్‌ను థాయిలాండ్ లో ప్రారంభించింది.

కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా మరియు దక్షిణ కొరియా వంటి దేశాలలో తన ఉనికిని చాటుకుంటోంది. ఇటీవల కాలంలో కంబోడియా మార్కెట్ కూడా మరింత వృద్ధి చెందుతోంది. ఈ కారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంబోడియా మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది.

MOST READ:మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

ప్రీమియం బైక్‌లు ఇప్పటికీ కంబోడియాలో కొనసాగుతున్నాయి. కవాసకి మరియు డుకాటీ వంటి సంస్థలు ఈ మార్కెట్లో పరిమిత విజయాన్ని సాధించాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మిడ్ సైజ్ విభాగంలో బైక్‌లను విడుదల చేయడం ద్వారా మరింత విజయవంతం పొందుతుంది.

కంబోడియాలో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్

కంబోడియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే కాకుండా, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు టివిఎస్ మరియు బజాజ్ ఆటో బ్రాండ్ వాహనాలు కూడా వినియోగంలో ఉన్నాయి.

MOST READ:టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

Most Read Articles

English summary
Royal Enfield company started its operations in Cambodia. Read in Telugu.
Story first published: Thursday, July 9, 2020, 16:44 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X