ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

కుర్రకారుని ఉర్రుతలూగించిన బైక్లలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చాలా బైకులు మార్కెట్లోకి విడుదలయ్యాయి. విడుదలైనప్పటినుంచి అమ్మకాలలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇంతటి పేరుపొందిన రాయల్ ఎన్ఫీల్డ్ లో ఇప్పుడు రెండు బైకులను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఎందుకు నిలిపివేయనున్నారు అనే విషయాన్నీ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్ లో బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్ల బుకింగ్ నిలిపివేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇప్పుడు రెండు మోడళ్లను భారతదేశంలో నిలిపివేసినట్లు కంపెనీ సూచించింది.

ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ ప్రకారం క్లాసిక్ 500 ను కూడా నిలిపివేశారని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో బుల్లెట్ మరియు థండర్బర్డ్ 500 లకు ఉన్న డిమాండ్ వల్ల ఇప్పటికి ఈ మోటార్ సైకిళ్ళ బుకింగ్ ని అంగీకరిస్తుంది.

ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈ రెండు బైకులను నిలిపివేయడానికి ప్రధాన కారణం 500 సిసి కి తగ్గుతున్న డిమాండ్ అనే చెప్పాలి. వీటికి డిమాండ్ తగ్గిపోవడంతో వీటిని నిలిపేసింది అని మనకు తెలుస్తుంది. ఇంకా దేశీయ అమ్మకాల ఎగుమతులు సంఖ్య కూడా బాగా తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క రెండు బైక్లు నిలిపివేయడానికి ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 లను ప్రవేశపెట్టడం కూడా ఒక కారణం కావచ్చు. ఇవి 500 సిసి మోడళ్ల కంటే 40,000 రూపాయల మెరుగైన ప్యాకేజీని అందిస్తుంది. కాబట్టి కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం వల్ల వినియోగదారులకు పాతవాహనాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ఈ కారణాల వల్ల బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్లు నిలిపివేయడం జరిగింది.

ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిసి మరియు 650సిసి మోటార్ సైకిళ్ళ మధ్య వున్న అంతరాయం కొత్తగా వస్తున్న జెన్ క్లాసిక్ మరియు థండర్‌బర్డ్ మోడళ్లతో తొలగిపోతుందని అని భావిస్తున్నారు.

ఇండియాలో నిలిపివేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500, థండర్బర్డ్ 500 బైక్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వచ్చిన కథనం ప్రకారం ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుంచి ఒక కొత్త వాహనం మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయబోతోంది. దీని పేరే రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 హిమాలయన్‌ బైక్. ఈ బైకులో కొత్త పెయింట్ స్కీమ్ తో పాటు అప్‌డేటెడ్ మెకానికల్స్ మరియు బిఎస్ 6 యొక్క కంప్లైంట్ ఇంజిన్‌తో త్వరలో ఇండియాలో విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
Royal Enfield Bullet 500 and Thunderbird 500 discontinued in India. Read in Telugu.
Story first published: Saturday, January 11, 2020, 17:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X