రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్: కార్గిల్

భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో ఎక్కువ అమ్మకాలు చేపడుతున్న ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విడుదలైన వాహనాలు నేటి యువతను మాత్రమే కాకుండా చాలా మందిని ఆకర్షించింది. ఇంతటి ప్రాధాన్యత పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మరో కొత్త మోటార్ సైకిల్ ని పరిచయం చేసింది. ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్: కార్గిల్

నాసిక్ ఆధారిత కస్టమ్ మోటారుసైకిల్ బిల్డర్ ఆర్నితోప్టర్ మోటో డిజైన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా 350 ను సవరించింది. ఈ సవరించిన మోటార్ సైకిల్ మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్: కార్గిల్

కొత్తగా మాడిఫైడ్ చేసిన బైక్ పేరు కార్గిల్ (KARGIL). ఈ 350 సిసి మోటార్ సైకిల్ భారత సాయుధ దళాల అధికారి కోసం ప్రత్యేకంగా రూపొందించింది. కొత్త మోటార్ సైకిల్ చూడటానికి నలుపు రంగులో ఉంటుంది. పునఃరూపకల్పన చేయబడిన ఈ వాహనం ఇంధన ట్యాంకుపై సైనికుల తెల్లటి సిల్హౌట్ ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్ కోసం ఎల్‌ఈడీ స్ట్రిప్, ఒరిజినల్ రియర్ వ్యూ మిర్రర్లను బార్-ఎండ్ వున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్: కార్గిల్

ఈ కొత్త 350 సిసి మోటారుసైకిల్ స్ప్లిట్ సీట్లను కలిగి ఉంటుంది. ఇవి ఒంటరిగా ప్రయాణించేటప్పుడు వెనుక విశ్రాంతి తీసుకోవడానికి వాటిని ముడుచుకోవదానికి అనుకూలంగా ఉంటుంది. మోటారుసైకిల్లో ఎయిర్ ఫిల్టర్, టూల్ కిట్ మరియు ఫ్యూజులను ఉంచే సైడ్ బాక్స్‌లు మరింత అప్డేట్ చేయబడ్డాయి మరియు వాటిపై KARGIL అనే పేరు కూడా ఉంటుంది. ఆర్నితోప్టర్ మోటో డిజైన్ స్టాక్ మఫ్లర్ స్థానంలో లాంగ్ రేంజ్ ఫిరంగి తుపాకీ నుండి బారెల్ లాగా ఉంది. బైక్‌కు మరింత ఓంఫ్ జోడించింది. కస్టమ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ హోల్డర్ వెనుక ఫెండర్‌పై అమర్చబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్: కార్గిల్

ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ని ఎంత నవీనీకరించినప్పటికీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయబడలేదు. ఇది 346 సిసి సింగల్ సిలిండర్ ని కలిగి ఉంటుంది. ఇది 19.8 బ్రేక్ హార్స్‌పవర్ ని ఉత్పత్తి చేయడంతో పాటు 28 ఎన్ఎమ్ టార్క్ ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

దీనిని డిజైన్ చేసిన ఆర్నితోప్టర్ మోటో అమోల్‌తో మాటాడినప్పుడు, దీనిని పునఃరూపకల్పన చేయడానికి దాదాపు 90,000 రూపాయలు ఖర్చు అయిందని వెల్లడించారు. దీనిని లెఫ్టినెంట్ ఆకాష్ జెండే కోసం మోటారుసైకిల్ నిర్మించబడిందని తెలిసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్: కార్గిల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కి 'కార్గిల్' అని పేరు పెట్టారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పటిదాకా చేసిన మోడల్స్ లో ఇది మంచి మోడల్ అని భావిస్తున్నాము. ఇది లెఫ్టినెంట్ జెండే కోసం ప్రత్యేకంగా తాయారు చేయబడింది. ఆర్నితోప్టర్ మోటో దీనికోసం చాలా కృషి చేసారు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా కల్గిస్తుంది.

Image Courtesy: Ornithopter/Facebook

Most Read Articles

English summary
Hero Xpulse 200 Rally Kit Launched In India At Rs 38,000: Street Legal And FMSCI Certified. Read in Telugu.
Story first published: Thursday, February 20, 2020, 12:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X