Just In
Don't Miss
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Movies
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్ఫీల్డ్ నుండి నాలుగు కొత్త బైకులు: హంటర్, షెర్పా, ఫ్లయింగ్ ఫ్లీ & రోడ్‌స్టర్
రాయల్ ఎన్ఫీల్డ్ అతి త్వరలో ఫ్లయింగ్ ఫ్లీ (Flying Flea) మరియు రోడ్‌స్టర్ (Roadster) అనే రెండు కొత్త బైకులను విడుదల చేయనుంది. అందులో భాగంగానే ఈ రెండు పేర్ల మీద ట్రేడ్‌మార్క్ గుర్తింపు కూడా పొందింది. వీటితో పాటు షెర్పా (Sherpa) మరియు హంటర్ (Hunter) అనే పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించింది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, రాయల్ ఎన్ఫీల్డ్ నాలుగు కొత్త మోటార్ సైకిళ్ల మీద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయిస్తున్న బైకులు మార్కెట్లోకి పాతవి కావడం, లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం వంటి అంశాల పరంగా మోటార్ సైకిల్ ప్రేమికులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మధ్య కాలంలో హిమాలయన్, ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జీటీ650 అనే మోటార్ సైకిళ్లతో అందర్నీ ఆకట్టుకుంది. 650 ట్విన్ మోటార్ సైకిళ్లు అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ వ్యాల్యూని అమాంతం పెంచేశాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగ ఫ్లయింగ్ ఫ్లీ మరియు రోడ్‌స్టర్ అనే పేర్ల మీద ట్రేడ్‌మార్క్ హక్కులు సాధించింది. చరిత్రలో మంచి గుర్తింపు పొందిన పాత బైక్ మోడళ్ల పేర్లను మళ్లీ ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జీటీ అనే పేర్లు పాతవే.

ఫ్లయింగ్ ఫ్లీ అనే పేరు చాలా పాతది. రెండో ప్రపంచ యుద్ద కాలంలో ఈ బైకును రాయల్ ఎన్ఫీల్డ్ WD/RE అని పిలిచేవారు. ఆ కాలంలో ఫ్లయింగ్ ఫ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్ సైకిల్.

రెండో ప్రపంచ యుద్దంలో బ్రిటీష్ సైనికులకు ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడింది. యుద్ద ప్రాంతంలో ఈ బైకులను పారాచూట్ ద్వారా విమానాల్లోనుండి కిందకు వదిలేవారు. అప్పట్లో సైనికులు వీటితో త్వరత్వరగా శత్రు స్థావరాలను చేరుకునే దాడులు చేసేందుకు ఉపయోగపడేవి.

రేడియో కనెక్టివిటీ లేని ప్రదేశాల్లో ఒక చోట నుండి మరో చోటకు సమాచారాన్ని చేరవేసేందుకు ఈ బైకుల్ని ఉపయోగించేవారు. అత్యంత ప్రమాదకరమైన మార్గాల గుండా ప్రయాణించేందుకు వీటిని వాడినట్లు చరిత్ర చెపుతోంది. విమానాల ద్వారా గాల్లో నుండి పారాచూట్ ద్వారా కిందకు వదలడం ద్వారా వీటికి ఫ్లయింగ్ ఫ్లీ అనే పేరు వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇంతటి చరిత్ర గల ఫ్లయింగ్ ఫ్లీ మోటార్ సైకిల్‌ను అత్యాధునునిక టెక్నాలజీ మళ్లీ తీసుకురానున్నారు.

"రోడ్‌స్టర్" బ్రాండ్ పేరు నిజానికి చారిత్రాత్మక పేరు అయితే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంతకుముందెన్నడూ ఈ మోడల్‌ను తయారు చేయలేదు. మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో రోడ్‌స్టర్ అనే పేరు అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్‌స్టర్ పేరుతో పూర్తిగా బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్ తీసుకొస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్‌స్టర్ మోటార్ సైకిల్ సింగల్ సీట్ మరియు హార్డ్ టెయిల్‌తో వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ గతంలో ఆవిష్కరించిన కెఎక్స్ 838 కాన్సెప్ట్ వెర్షన్ ఆధారంగా దీనిని తీసుకొచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో ఉన్న హ్యార్లీడేవిడ్సన్ మరియు ట్రయంప్ మోటార్ సైకిళ్లకు ఈ మోడల్ సరాసరి పోటీనిచ్చే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ మరియు రోడ్‌స్టర్ మోడళ్ల కంటే ముందే షెర్పా మరియు హంటర్ అనే రెండు మోటార్ సైకిళ్ల పేర్ల మీద ట్రేడ్‌మార్క్ హక్కులు సాధించింది. ఈ రెండింటిలో ఒకటి ఎంట్రీ లెవల్ క్లాసిక్ మోటార్ సైకిల్ కాగా రెండవది అడ్వెంచర్ మోటార్ సైకిల్ అని తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా లైనప్‌లో క్లాసిక్, బుల్లెట్ మరియు థండర్‌బర్డ్ అనే పాత మోటార్ సైకిళ్లు మాత్రమే ఉండేవి. వీటికి తోడు హిమాలయన్, ఇంటర్‌సెప్టా 650 మరియు కాంటినెంటల్ జీటీ650 మోటార్ సైకిళ్లను లాంచ్ చేసి, నూతన గాలిని ప్రవేశపెట్టింది. అయితే, వీటికి కొనసాగింపుగా భవిష్యత్తులో మరో నాలుగు బ్రాండ్ న్యూ మోడళ్లను లాంచ్ చేసేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ సిద్దమైంది.