హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

చెన్నైకి చెందిన దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ బీఎస్6 వెర్షన్ హిమాలయన్ బైక్ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. సరిగ్గా వారం క్రితం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బీఎస్6 బైకును రూ. 1.86 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి లాంచ్ చేసింది.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హిమాలయన్ బీఎస్6 వెర్షన్ డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ముంబాయ్‌కి చెందిన సంజయ్ సింగ్ అనే కస్టమర్ తొలి బీఎస్6 హిమాలయన్ బైకును డెలివరీ తీసుకున్నాడు. రాక్ రెడ్ పెయింట్ స్కీమ్‌లో ఉన్న బీఎస్6 హిమాలయన్ తీసుకున్నట్లు తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

రాక్ రెడ్ పెయింట్ స్కీమ్ హిమాలయన్‌కు బాగా సెట్ అయ్యింది. దీనితో పాటు ఆల్ బ్ల్యాక్, వైట్ మరియు స్లీట్ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బిఎస్6 వెర్షన్ హిమాలయన్ పాత మోడళ్లతో పోల్చితే ఎంతో అట్రాక్టివ్‌గా తీర్చిదిద్దారు.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బీఎస్6 మోటార్ సైకిల‌లో రీడిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. మునుపటి 5-టెల్ లైట్ల స్థానంలో ఈ సారి 7-టెల్ లైట్లు వచ్చాయి. అంటే బైకుకు సంభందించి ఏడు రకాల సమాచారాన్ని రైడర్‌కు ఇస్తాయి. ఎత్తైన విండ్ షీల్డ్ మరియు హజార్డ్ లైట్ స్విచ్చ్ అదనంగా వచ్చాయి.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

బీఎస్6 హిమాలయన్ బైకులో వచ్చిన అతి ముఖ్యమైన అప్‌డేట్.. స్విచ్చబుల్ ఏబీఎస్. ఆఫ్-రోడింగ్ చేస్తున్నపుడు రైడర్లు ఏబీఎస్ టెక్నాలజీని ఆఫ్ చేసుకునేందుకు స్విచ్ ఇచ్చారు. అదనంగా సైడ్ స్టాండ్ కూడా వచ్చింది. కొండ ప్రాంతాలు, మలుపులు మరియు హైవేల్లో అన్ని రకాల రైడింగ్‌కు ఉపయోగపడేలా రూపొందించారు.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

సరికొత్త 2020 రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ బీఎస్6 మోడల్‌లో అదే మునుపటి 411సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. బీఎస్6 నిబంధనలు పాటించే ఇంజన్ గరిష్టంగా 24.3బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రూ. 1.86 లక్షల నుండి రూ. 1.89 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో లభిస్తోంది. మరి దీనిని ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, స్లీట్ గ్రే, స్నో వైట్, గ్రానైట్ బ్లాక్, గ్రావెల్ గ్రే, లేక్ బ్లూ మరియు రాక్ రెడ్.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

రాయల్ ఎన్ఫీల్డ్‌కు సంభందించిన వార్తల్లో.. కంపెనీ ఇటీవల 500సీసీ రేంజ్‌లో లభించే బుల్లెట్, థండర్‌బర్డ్ మరియు క్లాసిక్ మోడళ్లను మార్కెట్ నుండి తొలగించింది. కంపెనీ వెబ్‌సైట్ నుండి కూడా ఈ మూడు మోడళ్లను తొలగించారు.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

నిజానికి ఈ 500సీసీ మోటార్ సైకిళ్లను విదేశీ ఎగుమతుల కోసం రూపొందించారు. అయితే, దేశీయంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా 2009లో వీటిని ఇండియన్ మార్కెట్లో కూడా లాంచ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఆశించిన మేర సేల్స్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుండి తొలగించే పరిస్థితి ఏర్పడింది.

హిమాలయన్ బీఎస్6 డెలివరీలు ప్రారంభం.. త్వరపడండి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హిమాలయన్ బైక్ ప్రియులకు ఇది నిజంగానే గుడ్‌న్యూస్.. సాలిడ్ బైక్, అన్ని రకాల రైడింగ్స్‌కు అనుకూలం మరియు ఆశ్చర్యపరిచే అద్భుతమైన రైడింగ్ లక్షణాలు దీని సొంతం. 2020 హిమాలయన్‌లో ఎన్నో కీలకమైన అప్‌డేట్స్ రావడంతో దీని మీద ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి. ధర కూడా అత్యంత పోటీతత్వంతో.. ధరకు తగ్గ విలువలు ఉండటంతో పర్ఫెక్ట్ ఆఫ్-రోడర్ ఎంచుకునే కస్టమర్లకు హిమాలయన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2020, 11:13 [IST]
English summary
Royal Enfield Himalayan BS6 Deliveries Begin: Mumbai Gets First Motorcycle. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+