రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా ధర పెంపుతో ఇప్పుడు కొత్త 2020 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.91 లక్షలుగా ఉంది. ఇది వరకు దీని ధర రూ.1.89 లక్షలుగా ఉండేది. ఈ మోటార్‌సైకిల్‌పై మొత్తంగా రూ.1,836 ధర పెరిగింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6లోని దాదాపు అన్ని పెయింట్ ఆప్షన్లపై ధరల పెరుగులు స్థిరంగా ఉంటుంది. ఇందులో గ్రానైట్ గ్రే, స్నో వైట్, స్లీట్ గ్రే, గ్రావెల్ గ్రే, రాకీ రెడ్ కలర్స్ ఉన్నాయి. అయితే, లావా బ్లూ కలర్ వేరియంట్ ధర మాత్రం రూ.1.95 లక్షలుగా ఉంటుంది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

ధరల పెరుగుదల మినహా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో ఇతర మార్పులు ఏమీ లేవు. చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ధరల పెరుగుదలకు గల కారణాన్ని అధికారికంగా పేర్కొనలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెరుగుతున్న ఉత్పాదక వ్యయం కారణంగా కంపెనీ ధరలు పెంచి ఉండవచ్చని తెలుస్తోంది.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

బిఎస్6 కంప్లైంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ శక్తివంతమైన 411సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 24 బిహెచ్‌పి శక్తిని మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న మహిళా పోలీస్.. బైక్ కొనడానికి కారణం అడిగితే ఏం చెప్పిందో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

ఈ ఏడాది జనవరి 2020 నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధరలు పెరుగటం ఇది రెండవసారి. గడచిన మార్చ్ 2020 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటిసారి బిఎస్6 హిమాలయన్ ధరలను పెంచింది. ఆ సమయంలో ఈ అడ్వెంచర్ టూరర్ ధరలను రూ.2700 మేర పెంచారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

హిమాలయన్‌తో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ ఐకానిక్ బుల్లెట్ 350 ధరలను కూడా పెంచింది. అన్ని బుల్లెట్ 350 వేరియంట్లపై సుమారు రూ.2,756 మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. - ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ఈ ఏడాదిలో వరుసగా రెండవసారి ధరల పెరుగుదలను అందుకుంది. అయినప్పటికీ, ఈ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ ధర రూ.2 లక్షల లోపే కొనసాగుతుంది. ఈ విభాగంలో ఇది బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్, కెటిఎమ్ 390 అడ్వెంచర్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Royal Enfield has hiked the prices of its BS6-compliant Himalayan adventure-tourer motorcycle in India. The 2020 Royal Enfield Himalayan BS6 motorcycle is now offered with a starting price of Rs 1.91 lakh, ex-showroom (Delhi), after receiving a hike of Rs 1,836. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X