రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రెండు మోడళ్లు బిఎస్6 అప్‌డేట్ అందుకున్న తర్వాత ధరలు పెరగటం ఇదే మొదటిసారి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

ఈ రెండు మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను విడుదల చేసిన సమయంలోనే కంపెనీ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 ధరలను వరుసగా రూ.8,000 మరియు రూ.9,000 మేర పెంచింది. అయినప్పటికీ, వీటి తయారీలో పెరుగుతున్న వ్యయాల కారణంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రెండు మోటార్‌సైకిళ్ల ధరలను మరోసారి సవరించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 వివిధ రంగులలో లభిస్తుంది, ఇవన్నీ ధరల పెరుగుదలను అందుకుంటాయి. వీటిలో ఆరెంజ్ క్రష్, సిల్వర్ స్పెక్టర్, మార్క్ త్రీ, రవిషింగ్ రెడ్, బేకర్ ఎక్స్‌ప్రెస్ మరియు టాప్-స్పెక్ గ్లిట్టర్ మరియు డస్ట్ కలర్స్ ఉన్నాయి.

Royal Enfield Interceptor 650
Variants New Price Old Price Price Difference
Orange Crush ₹2,66,755 ₹2,64,919 ₹1,836
Silver Spectre / Mark Three ₹2,66,755 ₹2,64,919 ₹1,836
Ravishing Red / Baker Express ₹2,74,643 ₹2,72,806 ₹1,837
Glitter and Dust ₹2,87,787 ₹2,85,951 ₹1,836

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్‌యూవీ : ధర & ఇతర వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

ఈ మోటారుసైకిల్ ధరలను సుమారు రూ.1,800 మేర పెంచారు. ధరల పెరుగుదల తరువాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధరలు ర .2.66 లక్షల నుండి రూ.2.87 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 విషయానికి వస్తే ఇది కూడా విభిన్న పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో వెంచురా బ్లూ, బ్లాక్ మ్యాజిక్, ఐస్ క్వీన్ వైట్, డాక్టర్ మేహెమ్ మరియు టాప్-స్పెక్ వేరియంట్ కోసం మిస్టర్ క్లీన్ కలర్స్ ఉన్నాయి.

Royal Enfield Continental GT 650
Variants New Price Old Price Price Difference
Ventura Blue / Black Magic ₹2,82,513 ₹2,80,677 ₹1,836
Ice Queen White / Dr Mayhem ₹2,90,401 ₹2,88,564 ₹1,837
Mister Clean ₹3,03,544 ₹3,01,707 ₹1,837

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్‌యూవీ : ధర & ఇతర వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

అన్ని కలర్ ఆప్షన్లపై సుమారు రూ.1800 మేర ధరలను పెంచారు. ధరల పెరుగుదల తరువాత, మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 ధరలు రూ.2.82 లక్షల నుండి రూ.3.03 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

ధరల పెంపు మినహా ఈ రెండు మోటార్‌సైకిళ్లలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 రెండూ ఒకే రకమైన 649సిసి ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్, పారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తాయి.

MOST READ:మీకు తెలుసా.. ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 13.2 లక్షలు.. ఎందుకంటే ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

ఈ ఇంజన్ గరిష్టంగా 7,150 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి శక్తిని మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో స్లిప్పర్-క్లచ్ అసిస్టెన్స్ ఉంటుంది. గరిష్ట టార్క్‌లో 80 శాతం 2,500 ఆర్‌పిఎమ్ వద్దే లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

ఈ రెండు మోటార్‌సైకిళ్లపై ఒకేరకమైన సస్పెన్షన్ ఉంటుంది. ముందు భాగంలో 41 మిమీ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబల్ ట్విన్-గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్ళు 18 ఇంచ్ స్పోక్డ్ వీల్స్ మరియు పిరెల్లి ఫాంటమ్ స్పోర్ట్ కాంప్ టైర్లను కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

ఇంటర్‌సెప్టర్ 650 సాధారణ స్థితిలో సెట్ చేయబడిన నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్లు మరియు ఫుట్‌పెగ్‌లతో మరింత రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. మరోవైపు, కాంటినెంటల్ జిటి 650 దాని లాంగ్ ట్యాంక్ డిజైన్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌లతో మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ 650 ధరల పెంపు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లయిన ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్ల ధరలను బిఎస్6 అప్‌డేట్ తర్వాత మొదటిసారిగా పెంచింది. ధరల పెరుగుదల స్వల్పమే కాబట్టి, ఇది వీటి అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Chennai-based two-wheeler manufacturer, Royal Enfield, has announced a price hike on the Interceptor 650 and the Continental GT650 flagship motorcycles in the Indian market. Both motorcycles have received its first price hike since the BS6 update from the company. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X