రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్ కోసం "మీటియోర్" అనే కొత్త 350సీసీ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ సరికొత్త మోటార్‌సైకిల్ మునుపెన్నడూ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లలో చూడని విధంగా అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్లతో ఇది అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ మీటియోర్‌కి సంబంధించి ఓ బ్రోచర్ లీక్ అయిన విషయం తెలిసినదే. అందులో కలర్ ఆప్షన్స్, వేరియంట్ డిటేల్స్ లీక్ అయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

తాజాగా, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఇంజన్‌కు సంబంధించిన వివరాలు కూడా లీక్ అయ్యాయి. రైడర్ లాల్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఇంజన్ వివరాలు, ఛాస్సిస్ డిటేల్స్ మరియు ఇందులో ఫీచర్ల గురించి ఈ వీడియోలో వివరించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

ఇందులో ప్రధానంగా, ఇంజన్ గురించి చెప్పుకుంటే, కొత్త మీటియోర్‌లో ప్రస్తుత 350 యుసిఈ యూనిట్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన కొత్త ఇంజన్‌ను ఉపయోగించారు. అంటే, ఇది ప్రస్తుత 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌పై తయారు చేసిన సరికొత్త ఓవర్‌హెడ్ కామ్‌షాఫ్ట్ (ఓహెచ్‌సి) అవుతుంది.

MOST READ:మూలికా పెట్రోల్ తయారీకి కేరళ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నెల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

ఇది లాంగ్-స్ట్రోక్ ఇంజన్, ఫలితంగా ఇది గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ని మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత యుసిఈ ఇంజన్‌తో పోలిస్తే ఈ కొత్త ఇంజన్ 1.1 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. యుసిఈ ఇంజన్ 19.1 బిహెచ్‌పి పవర్‌ని మరియు 28 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

కొత్త మీటియోర్‌లో సరికొత్త ఇంజన్‌తో పాటుగా, మెరుగైన ట్రాన్స్‌మిషన్ (గేర్‌బాక్స్) సిస్టమ్‌ను కూడా ఉంటుంది. కొత్త గేర్‌బాక్స్ సెటప్ ప్రస్తుత యుసిఈ యూనిట్లతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరును మరియు మైలేజీని ఆఫర్ చేస్తుందని అంచనా.

MOST READ:అంబులెన్స్ ముందుకు వెళ్ళడానికి దారి ఇవ్వని కార్ డ్రైవర్‌కి ఏం జరిగిందో చూసారా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్‌లో కొత్త మాడ్యులర్ జే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఛాస్సిస్‌ను తయారు చేశారు. ఇప్పుడు ఇది పెరిగిన హ్యాండిల్‌బార్‌తో అప్-రైట్ రైడర్ ఎర్గోనామిక్స్‌ను ఇస్తుంది. అయితే, ఇందులో థండర్బర్డ్ మోడల్స్‌లో ఉపయోగించిన సస్పెన్షన్ మరియు బ్రేకింగ్‌లను అలానే కొనసాగించవచ్చని తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

ఇందులో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్వర్లు మరియు రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనిని డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్‌గా అందించవచ్చు.

MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

ఈ కొత్త మోడల్‌లో హైలైట్ కానున్న బెస్ట్ ఫీచర్లలో ఒకటి, బ్లూటూత్ ఎనేబుల్ చేసిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్. మోటార్‌సైకిల్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేటం కోసం రిజర్వ్ చేయబడిన పెద్ద పాడ్‌తో ఇది ట్విన్-పాడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని చిన్న పాడ్ ఆన్-బోర్డ్ నావిగేషన్ సిస్టమ్‌గా చేస్తుంది, దీనిని 'ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్' అని పిలుస్తారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. దీనిపై జిపిఎస్ నావిగేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పేస్-నోట్ టైప్ యారోస్ రూపంలో చూపిస్తుంది. ఈ నావిగేషన్ యూనిట్‌లో డే అండ్ నైట్ మోడ్‌లు కూడా ఉంటాయి.

MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

మెయిన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ డిస్‌ప్లేని కలిగి ఉండి, స్పీడ్, టాకోమీటర్ మరియు ట్రిప్ వివరాల వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో యూఎస్‌బి మొబైల్ ఛార్జింగ్ స్లాట్‌ను కూడా జోడించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ బాబర్ స్టైల్ ఎలిమెంట్స్‌తో పాటుగా బ్రాండ్ యొక్క రెట్రో మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద స్కల్ప్చర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఈ బ్రాండ్ నుండి మొదటిసారి ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన గుండ్రటి ఆకారంలో ఉండే హాలోజన్ హెడ్‌ల్యాంప్‌ ఉంటుంది. వెనుక భాగంలో లో-సెట్ టర్న్ ఇండికేటర్‌తో కూడిన ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్ కూడా ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' ఇంజన్ వివరాలు లీక్; ఫీచర్లు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఇంజన్ వివరాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త మీటియోర్ 350 ఈ బ్రాండ్ నుండి వస్తున్న లేటెస్ట్ టెక్ లోడెడ్ మోటార్‌సైకిల్‌గా చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత మార్కెట్ ధోరణిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఈ మోడల్‌ను డెవలప్ చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోని బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్, జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Royal Enfield will be launching an all-new motorcycle called the Meteor 350 in the Indian market. The Meteor 350 will feature some of the brand's new feature that will make its debut on the motorcycle. This includes an all-new engine, a Bluetooth enabled instrument cluster and more. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X