భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

దేశీయ మార్కెట్లో వాహనప్రియలను ఉర్రూతలూగిస్తున్న ద్విచక్ర వాహన తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మేటోర్ 350 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.75 లక్షలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 సంస్థ యొక్క కొత్త మోడల్, కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 కి కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఆకర్షణీయమైన స్టైలింగ్ మరియు శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా దాని బుకింగ్ కూడా ప్రారంభించబడింది, దాని డెలివరీ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది మరియు దాని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.90 లక్షలు. ఈ మోడల్ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేయబడింది. అలాగే, ఇది మొత్తం ఏడు కలర్ అప్సన్లలో తీసుకురాబడింది.

MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 డిజైన్ గమనించినట్లయితే, దీనికి క్రూయిజర్ బైక్ లుక్ ఇవ్వబడింది, దీని కారణంగా రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్, టైర్ డ్రాప్ ఆకారంలో ఫ్యూయెల్ ట్యాంక్, రియర్ బ్యాక్ రెస్ట్, స్ప్లిట్ సీట్ ఇవ్వబడ్డాయి. అదే విధంగా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, హై హ్యాండిల్‌బార్లు అందించారు.

'ట్రిప్పర్ నావిగేషన్' అని పేరు పెట్టబడిన ఈ బైక్‌లోని టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ గా ఇవ్వబడింది. ఈ బైక్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఆన్ ఇండికేటర్, డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ మరియు విండ్‌స్క్రీన్, బ్లాక్డ్ మెకానికల్ బిట్స్ ప్రతిచోటా లభిస్తుంది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

దీనికి యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో పాటు సస్పెన్షన్ కోసం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ సైడ్ రియర్ షాక్ అబ్జార్బర్, బ్రేకింగ్ కోసం రెండు వైపులా సింగిల్ డిస్క్ అందించబడుతుంది. ట్యూబ్‌లెస్ టైర్లను కంపెనీ ఇందులో ఏర్పాటు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 యొక్క ఈ ఇంజన్ 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది జె సిరీస్ ఓహెచ్‌సి ఇంజిన్. కొత్త మేటోర్ 350 పై 3 సంవత్సరాల వారంటీ కూడా స్టాండర్డ్ గా ఇవ్వబడింది.

MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్ కొలతలను గమనించినట్లయితే ఇది 2,140 మి.మీ పొడవు, 1,140 మి.మీ ఎత్తు, సీటు ఎత్తు 765 మి.మీ, వీల్‌బేస్ 1,400 మి.మీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ ఉంటుంది. ఈ బైక్ జావా, బెనెల్లి ఇంపీరియల్ 400 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Royal Enfield Meteor 350 Launched. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X