రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 350సీసీ క్రూయిజర్ మోటార్‌సైకిల్ మీటియోర్, ఆ బ్రాండ్‌కి లక్కీ ఛార్మ్‌లా పనిచేస్తోంది. మార్కెట్లో విడుదలైన మొదటి నెలలోనే మీటియోర్ 350 అమ్మకాల పరంగా దూసుకెళ్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

గడచిన నవంబర్ 2020లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 7,031 యూనిట్ల మీటియోర్ 350 మోడళ్లను విక్రయించినట్లు పేర్కొంది. తాజా నివేదికల ప్రకారం, గడచి నవంబర్ 2020 నెలలో పాపులర్ క్లాసిక్ 350 మోడల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్‌గా మీటియోర్ 350 నిలిచింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

పాపులర్ థండరబ్డ్ సిరీస్ వాహనాలను రీప్లేస్ చేసేందుకు వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో విజయవంతమైన మోడల్‌గా కొనసాగుతోంది. గత నెలలో ఇది అమ్మకాల పరంగా బుల్లెట్ 350 మరియు ఎలక్ట్రా 350 మోడళ్లను అధిగమించి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం దాని 350సిసి విభాగంలో నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. అవి: ఎలక్ట్రా, బుల్లెట్, మీటియోర్ మరియు క్లాసిక్ మోటార్‌సైకిళ్ళు. మొత్తంగా చూసుకుంటే ఈ 350సీసీ విభాగంలో కంపెనీ గడచిన నెలలో 56,494 యూనిట్లను విక్రయించింది. వీటిలో అత్యధికంగా 39,391 యూనిట్లు క్లాసిక్ 350 మోడళ్లే ఉన్నాయి, ఇవి మొత్తం 350సీసీ అమ్మకాలలో 69 శాతానికి పైగా ఉన్నాయి.

Rank Model Nov'20 Nov'19 Growth (%)
1 Classic 350 39,391 35,951 9.57
2 Meteor 350 7,031 0 -
3 Bullet 350 6,513 12,902 -49.52
4 Electra 350 3,490 3,641 -4.15
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

ఈ విభాగంలో విక్రయించిన ఇతర మూడు మోడళ్లలో మీటియోర్ 350 మొత్తం వాటాలో 12 శాతానికి పైగా ఉంది. ఇకపోతే, బుల్లెట్ 11 శాతం మరియు ఎలక్ట్రా 6 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

మీటియోర్ మార్కెట్లో విడుదలైన కేవలం ఒక్క నెలలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలో విక్రయించే ఇతర 350 సిసి మోడళ్లను ఓడించి రెండవ స్థానానికి చేరుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఈ విభాగంలో సరికొత్త డిజైన్ మరియు సరికొత్త ఇంజన్‌తో వచ్చిన మోడల్ కావటంతో అతికొద్ది సమయంలోనే ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి: ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్‌నోవా. మార్కెట్లో ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.75 లక్షలు (ఫైర్‌బాల్)గా ఉండగా మిడ్-వేరియంట్ అయిన స్టెల్లార్ ధర రూ.1.81 లక్షలుగా మరియు టాప్-ఎండ్ వేరియంట్ అయిన సూపర్‌నోవా ధర రూ.1.90 లక్షలుగానూ ఉన్నాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్‌సైకిల్‌లో తొలిసారిగా సరికొత్త 349సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

మీటియోర్ 350 మోటారుసైకిల్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో కొత్త డబుల్-క్రాడిల్ ఛాస్సిస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన గుండ్రటి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, పొడవాటి సైలెన్సర్, ఇగ్నిషన్ మరియు హెడ్‌ల్యాంప్ ఆపరేషన్ల కోసం డయల్స్‌తో కూడిన సరికొత్త స్విచ్ గేర్ యూనిట్ మొదలైనవి ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..

ఇంకా ఇందులోని పెద్ద 15-లీటర్ల ఇంధన ట్యాంక్, పెంచిన మరియు విశాలమైన హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, బాగా కుషన్డ్ సీట్లు మరియు పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఫీచర్లు సుదీర్ఘమైన ప్రయాణాలకు సైతం అనువుగా ఉంటాయి. విండ్‌బ్లాస్ట్ నుండి రైడర్‌ను రక్షించడానికి ఈ మోటారుసైకిల్‌లో పొడవైన విండ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ మోడల్‌ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేసింది. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 22, 2020, 12:42 [IST]
English summary
Royal Enfield Has Sold Over 7,000 Units Of Meteor 350 Motorcycles In November 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+