Just In
- 1 hr ago
కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు
- 1 hr ago
త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ
- 2 hrs ago
స్కార్పియోని ఓవర్టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్
- 2 hrs ago
భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్లు విడుదల; ధర మరియు ఫీచర్లు
Don't Miss
- Sports
నిబంధనలు అన్నీ పక్కన పెట్టి.. మీకు నచ్చింది చేయండి: జడేజా
- Movies
‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- News
వైఎస్ జగన్ సంచలనం: సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు కుదరవిక: కట్టడిపై
- Finance
లక్షా 60వేల మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ బంపరాఫర్, బోనస్, ప్రమోషన్లు
- Lifestyle
ఆయుర్వేదం ప్రకారం, ఈ ఆహారాలను ఈ ఆహారాలతో పాటు తినకూడదు ...తింటే ప్రమాదకరం ...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 నిజంగా లక్కీ ఛార్మే..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 350సీసీ క్రూయిజర్ మోటార్‌సైకిల్ మీటియోర్, ఆ బ్రాండ్‌కి లక్కీ ఛార్మ్‌లా పనిచేస్తోంది. మార్కెట్లో విడుదలైన మొదటి నెలలోనే మీటియోర్ 350 అమ్మకాల పరంగా దూసుకెళ్తోంది.

గడచిన నవంబర్ 2020లో రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం 7,031 యూనిట్ల మీటియోర్ 350 మోడళ్లను విక్రయించినట్లు పేర్కొంది. తాజా నివేదికల ప్రకారం, గడచి నవంబర్ 2020 నెలలో పాపులర్ క్లాసిక్ 350 మోడల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్‌గా మీటియోర్ 350 నిలిచింది.

పాపులర్ థండరబ్డ్ సిరీస్ వాహనాలను రీప్లేస్ చేసేందుకు వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో విజయవంతమైన మోడల్‌గా కొనసాగుతోంది. గత నెలలో ఇది అమ్మకాల పరంగా బుల్లెట్ 350 మరియు ఎలక్ట్రా 350 మోడళ్లను అధిగమించి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.
MOST READ:మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్.. ఇప్పుడు మరింత సూపర్ స్టైల్ గురూ!

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం దాని 350సిసి విభాగంలో నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. అవి: ఎలక్ట్రా, బుల్లెట్, మీటియోర్ మరియు క్లాసిక్ మోటార్‌సైకిళ్ళు. మొత్తంగా చూసుకుంటే ఈ 350సీసీ విభాగంలో కంపెనీ గడచిన నెలలో 56,494 యూనిట్లను విక్రయించింది. వీటిలో అత్యధికంగా 39,391 యూనిట్లు క్లాసిక్ 350 మోడళ్లే ఉన్నాయి, ఇవి మొత్తం 350సీసీ అమ్మకాలలో 69 శాతానికి పైగా ఉన్నాయి.
Rank | Model | Nov'20 | Nov'19 | Growth (%) |
1 | Classic 350 | 39,391 | 35,951 | 9.57 |
2 | Meteor 350 | 7,031 | 0 | - |
3 | Bullet 350 | 6,513 | 12,902 | -49.52 |
4 | Electra 350 | 3,490 | 3,641 | -4.15 |

ఈ విభాగంలో విక్రయించిన ఇతర మూడు మోడళ్లలో మీటియోర్ 350 మొత్తం వాటాలో 12 శాతానికి పైగా ఉంది. ఇకపోతే, బుల్లెట్ 11 శాతం మరియు ఎలక్ట్రా 6 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

మీటియోర్ మార్కెట్లో విడుదలైన కేవలం ఒక్క నెలలోనే రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో విక్రయించే ఇతర 350 సిసి మోడళ్లను ఓడించి రెండవ స్థానానికి చేరుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఈ విభాగంలో సరికొత్త డిజైన్ మరియు సరికొత్త ఇంజన్‌తో వచ్చిన మోడల్ కావటంతో అతికొద్ది సమయంలోనే ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి: ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్నోవా. మార్కెట్లో ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.75 లక్షలు (ఫైర్‌బాల్)గా ఉండగా మిడ్-వేరియంట్ అయిన స్టెల్లార్ ధర రూ.1.81 లక్షలుగా మరియు టాప్-ఎండ్ వేరియంట్ అయిన సూపర్నోవా ధర రూ.1.90 లక్షలుగానూ ఉన్నాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోటార్‌సైకిల్‌లో తొలిసారిగా సరికొత్త 349సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మీటియోర్ 350 మోటారుసైకిల్లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో కొత్త డబుల్-క్రాడిల్ ఛాస్సిస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్లతో కూడిన గుండ్రటి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, పొడవాటి సైలెన్సర్, ఇగ్నిషన్ మరియు హెడ్‌ల్యాంప్ ఆపరేషన్ల కోసం డయల్స్‌తో కూడిన సరికొత్త స్విచ్ గేర్ యూనిట్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

ఇంకా ఇందులోని పెద్ద 15-లీటర్ల ఇంధన ట్యాంక్, పెంచిన మరియు విశాలమైన హ్యాండిల్బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, బాగా కుషన్డ్ సీట్లు మరియు పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఫీచర్లు సుదీర్ఘమైన ప్రయాణాలకు సైతం అనువుగా ఉంటాయి. విండ్‌బ్లాస్ట్ నుండి రైడర్‌ను రక్షించడానికి ఈ మోటారుసైకిల్‌లో పొడవైన విండ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ మోడల్ని మా డ్రైవ్స్పార్క్ బృందం ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేసింది. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.