Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' స్పెసిఫికేషన్లు ఇవే..
భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయించిన థండర్‌బర్డ్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు కొత్త "మీటియోర్" అనే 350సీసీ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించి అనేక సమాచారం ఇంటర్నెట్‌లో లీక్ అవ్వగా, తాజాగా దీని స్పెసిఫికేషన్లు, ప్రధాన ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో మునుపెన్నడూ చూడని విధంగా అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్లతో మీటియోర్ మోటార్‌సైకిల్‌ను డెవలప్ చేశారు. తాజాగా, గాడివాడి విడుదల చేసిన చిత్రం ప్రకారం, మీటియోర్ 350లోని కీలక ఫీచర్లు, వివరాలు వెల్లడయ్యాయి.

చిత్రాలలో చూపినట్లుగా, ఇందులో కొత్త 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో గేర్‌బాక్స్ గురించి పేర్కొనకపోయినప్పటికీ, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రావచ్చని తెలుస్తోంది.
MOST READ:కియా సోనెట్‌లో అందరూ మెచ్చుకునే టాప్ 8 ఫీచర్లు ఏంటో తెలుసా?

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 270 మిమీ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి. అలాగే, ముందు వైపు స్టాండర్డ్ 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 6-రకాలుగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది.

మీటియోర్ 350 డిజైన్‌ను గమనిస్తే, ఇది మరింత రిలాక్స్డ్ మరియు కంఫర్టబల్ రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. దీనికోసం ఇందులోని ఈ మోటార్‌సైకిల్‌లో పెరిగిన హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లు మరియు తక్కువ ఎత్తు కలిగిన రైడర్ సీట్ హైట్‌లు సహకరిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లు. ఇదివరకటి థండర్‌బర్డ్ (20 లీటర్లు) మోడళ్ల కన్నా ఇది 5 లీటర్లు తక్కువ.
MOST READ:65 బిహెచ్‌పి శక్తినిచ్చే దేశంలోని ఏకైక ట్విన్ సిలిండర్ లాంబ్రేటా స్కూటర్.. ఇదే

రాయల్ ఎ350 న్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్‌లో కొత్త మాడ్యులర్ జే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఛాస్సిస్‌ను తయారు చేశారు. ఈ కొత్త మోడల్‌లో హైలైట్ కానున్న బెస్ట్ ఫీచర్లలో ఒకటి, బ్లూటూత్ ఎనేబుల్ చేసిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్.

మోటార్‌సైకిల్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేటం కోసం రిజర్వ్ చేయబడిన పెద్ద పాడ్‌తో ఇది ట్విన్-పాడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని చిన్న పాడ్ ఆన్-బోర్డ్ నావిగేషన్ సిస్టమ్‌గా చేస్తుంది, దీనిని ‘ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్' అని పిలుస్తారు.
MOST READ:రూ. 5 లక్షల లోపు ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 5 కార్లు ఇవే.. చూసారా

ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. దీనిపై జిపిఎస్ నావిగేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పేస్-నోట్ టైప్ యారోస్ రూపంలో చూపిస్తుంది. ఈ నావిగేషన్ యూనిట్‌లో డే అండ్ నైట్ మోడ్‌లు కూడా ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ బాబర్ స్టైల్ ఎలిమెంట్స్‌తో పాటుగా బ్రాండ్ యొక్క రెట్రో మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద స్కల్ప్చర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఈ బ్రాండ్ నుండి మొదటిసారి ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన గుండ్రటి ఆకారంలో ఉండే హాలోజన్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. వెనుక భాగంలో లో-సెట్ టర్న్ ఇండికేటర్‌తో కూడిన ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్ కూడా ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఇంజన్ వివరాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి సారిగా బ్లూటూత్ ఎనేబల్డ్ కనెక్టింగ్ టెక్నాలజీ కలిగిన మోటార్‌సైకిల్‌ను భారత్ కోసం డెవలప్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత మార్కెట్ ధోరణిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఈ మోడల్‌ను తయారు చేసింది.