ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే ప్రముఖ దేశీయ మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ మోడల్ 'రాయర్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్. మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ మోడల్‌ను భారత రోడ్లపై కంపెనీ విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ మోడల్‌కి సంబంధించిన చిత్రాలు మరోసారి ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి.

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ 350సిసి లైనప్‌లో ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. మెటియోర్ (తెలుగులో ఉల్కాపాతం అని అర్థం) పేరుతో రానున్న ఈ రెట్రో-లుకింగ్ మోటార్‌సైకిల్, భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క థండర్‌బర్డ్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని రీప్లేస్ చేయనుంది.

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

గాడివాడి విడుదల చేసిన స్పై చిత్రాలను గమనిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మెటియోర్ మోడల్‌ను ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా అన్ని వివరాలు వెల్లడయ్యే విధంగా టెస్టింగ్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ మోడల్ విడుదల సమయం సమీపిస్తోందని తెలుస్తోంది. ఈ స్పై చిత్రాల్లో మోటార్‌సైకిల్‌కు సంబంధించిన దాదాపు అన్ని ఫీచర్లు వెల్లడవుతున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

MOST READ: 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

వాస్తవానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. కానీ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలోని ఇతర ఆటో మేకర్స్ మాదిరిగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. లాక్‍‌డౌన్ సడలింపుల నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మెటియోర్ మోడల్ టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది.

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు విశిష్టమైన ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. ఇది పురాతన మోడళ్లను తలపించేలా బాబ్బర్ స్టైల్‌లో ఉంటుంది. పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు ఈ డిజైన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.

MOST READ: ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, ఇందులో సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా చూడొచ్చు. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ రీడింగ్ ఉన్నాయి. అంటే ఈ కొత్త కన్సోల్ ద్వారా రైడర్ తన మోటార్‌సైకిల్ వేగాన్ని డిజిటల్ గాను అలాగే అనలాగ్ రూపంలో కూడా రీడౌట్ చేయటానికి అవకాశం ఉంటుంది.

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

అంతేకాకుండా, ఈ డిజిటల్ డిస్‌ప్లే రైడర్‌కు అనేక ఇతర సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఓడిఓ మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, యావరేజ్ స్పీడ్ మరియు గేర్ ఇండికేటర్ వంటి సమచారాన్ని తెలియజేస్తుంది.

ఈ మోటార్‌సైకిల్‌పై స్విచ్‌గేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇది డిజిటల్ కెమెరా ఆపరేటింగ్ స్విచ్‌ను పోలి ఉండే స్విచ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో కుడివైపు ఇంజన్ ఆన్/ఆఫ్ స్విచ్ మరియు ఎడమ వైపు లైటన్ ఆన్/ఆఫ్ స్విచ్‌లు ఉంటాయి.

MOST READ: మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీని సపోర్ట్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ ఈ బ్రాండ్ నుంచి రానున్న మొట్టమొదటి బ్లూటూత్ ఎనేబుల్డ్ మోటార్‌సైకిల్‌గా మారుతుంది.

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

ఇకపోతే ఈ కొత్త మోటారుసైకిల్‌లో అతిపెద్ద మార్పు ఇందులోని కొత్త ఇంజన్. ఇది ప్రస్తుతం ఉపయోగిస్తున్న 346 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో సరికొత్త ఓవర్‌హెడ్ కామ్‌షాఫ్ట్ (ఓహెచ్‌సి) వెర్షన్‌ను తయారు చేశారు. ప్రస్తుత టాప్పెట్-వాల్వ్ యూసిఈ 350సీసీ ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది మరింత బెటర్ ఫెర్మార్మెన్స్ మరియు అధిక మైలేజ్‌ను ఆఫర్ చేయనుంది.

MOST READ: త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ టాప్పెట్-వాల్వ్ యూసిఈ ఇంజన్లను బిఎస్6 స్టాండర్డ్స్‌కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ 346 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 19.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

మీటియోర్ 350 మోటార్‌సైకిల్ 9-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌తో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని ఎగ్జాస్ట్ (సైలెన్సర్) పూర్తి బ్లాక్ కలర్‌లో ఉంటుంది. మీటియోర్ 350 మోటార్‌సైకిల్ రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి కుషనింగ్ కలిగిన సీట్స్, విశాలమైన ఫ్రంట్ ఫుట్ పెగ్స్, మంచి రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ అనుభూతి కొసం డిజైన్ చేసిన హ్యాండిల్ బార్ వంటి కీలక ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

MOST READ: సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

ఇదే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 స్పై పిక్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త మోడల్ మీటియోర్ 350. ఫ్రెష్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీల కలయికతో రూపుదిద్దుకుంటున్న ఈ రెట్రో-మోడ్రన్ లుక్ మోటార్‌సైకిల్ తప్పనిసరిగా బైక్ ప్రియులను ఆకర్షిస్తుదనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది ఈ సెగ్మెంట్లోని బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్, జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Image Courtesy: Gaadiwaadi

Most Read Articles

English summary
The Chennai-based company, Royal Enfield, is gearing up to launch an all-new motorcycle in its 350cc line-up. Called the Meteor, is a retro-looking motorcycle that is expected to replace the Thunderbird X range of motorcycles when launched in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more