Just In
- 15 min ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 1 hr ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 3 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
Don't Miss
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- News
సుప్రీం తీర్పుతో డైలమాలో సర్కారు, ఉద్యోగులు- ఎస్ఈసీకి సహకారం ? కీలక చర్చలు
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ డెలివరీస్ షురూ..!
రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఇటీవల భారత మార్కెట్లో ప్రారంభించబడింది. ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 డెలివరీ కూడా ప్రారంభించబడింది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 డెలివరీకి సంబధించిన ఫోటోలు కూడా బయటపడ్డాయి.

బయటపడ్డ ఈ ఫోటో ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 యొక్క మొదటి డెలివరీ పంజాబ్‌లో జరిగింది. ఎల్లో కలర్ మోడల్ యొక్క బైక్ కీ వినియోగదారునికి అప్పగించారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్రూయిజర్ మోడల్ ఈ రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అలాగే మొత్తం బైక్ చాలా విలాసవంతమైన రీతిలో ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 సంస్థ యొక్క కొత్త క్రూయిజర్ మోడల్, దీనిని థండర్బర్డ్ 350 స్థానంలో భారతదేశంలో చాలా ఫీచర్లు మరియు పరికరాలము అమర్చడం జరిగింది. వీటి ధర ప్రారంభ ధర రూ. 1.75 లక్షలు. ఇది ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉంది.
MOST READ:జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 యొక్క ఈ ఇంజన్ 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది J సిరీస్ OHC ఇంజిన్. ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయబడింది, దీనిలో సంస్థ యొక్క కొత్త మోడళ్లు ఉత్పత్తి చేయబడతాయి.

పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ను విడుదల చేసింది. దీనితో పాటు, కొత్త మీటియోర్ 350 పై 3 సంవత్సరాల వారంటీ కూడా ఇవ్వబడుతోంది. భారత మార్కెట్లో జావా బెనెల్లి ఇంపీరియల్ 400 మరియు ఇటీవల ప్రారంభించిన హోండా హైనెస్ సిబి 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:భారత్‌లో ఇ-సైకిళ్లను విడుదల చేసిన గోజీరో.. పూర్తి వివరాలు

'ట్రిప్పర్ నావిగేషన్' అని పేరు పెట్టబడిన ఈ క్రూయిజర్ బైక్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఇవ్వబడింది. ఈ బైక్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఆన్ ఇండికేటర్, డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ మరియు విండ్‌స్క్రీన్, బ్లాక్డ్ మెకానికల్ బిట్స్ ప్రతిచోటా లభిస్తుంది.

దీనికి యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సస్పెన్షన్ కోసం, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్-సైడ్ రియర్ షాక్ అబ్జార్బర్ అమర్చబడి, బ్రేకింగ్ కోసం రెండు వైపులా సింగిల్ డిస్క్ అందించబడుతుంది. అంతే కాకుండా డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో పాటు. ఇందులో సియాట్‌తో ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు.
MOST READ:వాహనాల వేగపరిమితిని పెంచడానికి ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

కంపెనీ యొక్క ఈ కొత్త బైక్ కొలతలను గమనించినట్లైతే ఇది 2,140 మి.మీ పొడవు, 1,140 మి.మీ ఎత్తు, 765 మి.మీ ఎత్తైన సీట్, 1,400 మి.మీ వీల్ బేస్ మరియు 170 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఏడు కలర్ అప్సన్లలో తీసుకురాబడింది. అయినప్పటికీ ఇది ఎల్లో కలర్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అది ఎన్ని బుకింగ్‌లు అందుకుంటుందో వేచి చూడాలి.
Image Courtesy: Gobinder Singh/Facebook