Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నవంబర్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్, చూసారా !
ఇటీవల కాలంలో వాహనప్రియులు ఎక్కువ ఇష్టపడుతున్న ద్విచక్ర వాహనం రాయల్ ఎన్ఫీల్డ్. ఇది నిజంగా దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కొంత కాలం కిందట తన మీటియోర్ 350 బైక్ విడుదల చేసింది. విడుదలైనప్పటి నుంచి ఈ బైక్ కి మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది.

రెట్రో-క్లాసిక్ బైక్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ 2020 నవంబర్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, గత నెలలో కంపెనీ అమ్మకాలు గత సంవత్సరంతో సమానంగా ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కంపెనీ గత నెలలో 59,084 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలిసింది.

కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 58,292 యూనిట్ వాహనాలను విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు పెద్దగా పెరగలేదని ఈ గణాంకాలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం అమ్మకాలు గమనించినట్లయితే 2020 నవంబర్‌లో కంపెనీ 63,782 బైక్‌లను విక్రయించినాట్లు సమాచారం.
MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ : ధర & వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ గత ఏడాది నవంబర్‌లో 60,411 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. కంపెనీ అమ్మకాలు ఈ నెలలో మొత్తం 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఎగుమతులు గత నెలలో పెరిగాయి. 2019 నవంబర్‌లో కంపెనీ కేవలం 2,119 యూనిట్లను మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయగా, ఈ నవంబర్ 2020 లో కంపెనీ మొత్తం 4,698 యూనిట్లను ఎగుమతి చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ చాలా కాలంగా విదేశీ మార్కెట్లపై దృష్టి సారించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ తన రెండు 650 సిసి బైక్లయిన ఎన్ఫీల్డ్ హిమాలయన్ మరియు ఇటీవల ప్రారంభించిన రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 బైకులను ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 సిసి ప్లాట్‌ఫామ్‌పై కొత్త ఇంజన్, చాసిస్ మరియు సస్పెన్షన్‌తో నిర్మించబడింది.
MOST READ:టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త మీటియోర్ 350 ను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది మరియు రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవలే థాయ్‌లాండ్ నుండి విదేశీ మార్కెట్లకు కొత్త మీటియోర్ 350 ను రవాణా చేయడం ప్రారంభించింది. ఈ కొత్త మీటియోర్ 350 లో ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ లో 350 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 20.2 బిహెచ్పి శక్తిని, 27 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించబడుతుంది. ఏది ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 కంపెనీ యొక్క అమ్మకాలను వృద్ధి చేయడంలో సహాయపడుతోంది. ఇది హోండా హైనెస్ సిబి 350 బైక్ కి ప్రత్యర్థిగా కూడా ఉంది.
MOST READ:2020 డిసెంబర్లో లాంచ్ కానున్న కొత్త కార్లు : వివరాలు