రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

భారతదేశంలో మోటార్ వాహన చట్టం ప్రకారం నిబంధనలను పాటించని వాహనదారులకు జరిమానాలు విధించడం తెలిసిన విషయమే. హెల్మెట్ లేకపోవడం వల్ల సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటి వాటికి కొంత మొత్తం జరిమానాలు విధిస్తారు. కానీ హర్యానా రాష్ట్రంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనదారునికి ఏకంగా 23,000 రూపాయలు జరిమానా విధించారు. ఇంత మొత్తం జరిమానానని ఎందుకు విధించారన్నా విషయాన్ని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

మోటార్ వాహన చట్టం ప్రకారం కచ్చితంగా రోడ్డు నియమాలను పాటించాలి. లేకుంటే వారికి చట్ట పరమైన జరిమానాలు విధిస్తారు. హర్యానా లోని సిర్రలో ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనదారున్ని గుర్తించి అతనికి భారీ జరిమానాను విధించడమే కాకుండా వాహనాన్ని సీజ్ చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

పోలీసుల కథనం మేరకు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడర్ ఎక్కువ సౌండ్ చేస్తూ పబ్లిక్ రోడ్లపై చాలా సార్లు వెళ్ళాడు. అంతే కాకుండా ఎక్కువ సౌండ్ కలిగిన ఈ బైక్ ని రైడర్ అధిక వేగంతో ప్రయాణిస్తూ పదే పదే యు-టర్న్ తీసుకుని ప్రయాణించాడు. ఈ విధంగా పబ్లిక్ రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణించిన రైడర్ ని పోలీసులు పట్టుకున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడర్ ని పట్టుకుని బైక్ కి సంబంధించిన పత్రాలను అడిగారు. కానీ వారివద్ద ఎలాంటి పత్రాలు లేవు. బైక్ రైడర్స్ కి ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల పోలీసులు బైక్ ని స్వాధీనం చేసుకుని, వారికి 23,000 రూపాయల జరిమానాను విధించారు. అంతే కాకుండా ఇచ్చిన గడువు లోపల బైక్ కి సంబంధించిన పత్రాలను చూపించినట్లైతే జరిమానా తక్కువ పడే అవకాశం ఉందని తెలిపారు.

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్ కి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ మరియు కంట్రోల్ సర్టిఫికేట్ కింద పొల్యూషన్ వంటి పత్రాలు లేకుండా రైడ్ చేయడం వల్ల ఇతర జరిమానాలు కూడా విధించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

ప్రజా రహదారులపై ఎగ్జాస్ట్‌లను వ్యవస్థాపించడం మరియు ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఇలాంటి వాహనాల వల్ల చాల శబ్ద కాలుష్యం జరుగుతుంది. అంతే కాకుండా ఇతర వాహనదారులకు కూడా చాల ఇబ్బంది కరంగా కూడా ఉంటుంది. సాధారణంగా వాహనాలు ప్రభుత్వం నిర్దేశించినస్థాయిలోనే సౌండ్ ని కలిగి ఉండాలి. ఇప్పటికే చాలా మంది యువ రైడర్లు చాలా సంఘటనలలో పోలీసులకు పట్టుబడ్డారు.

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కి రూ. 23,000 జరిమానా విధించిన పోలీసులు, ఎందుకంటే.. ?

భారతదేశంలో ఇటువంటి ఎగ్జాస్ట్‌ల అమ్మకం చట్టబద్ధమైనప్పటికీ, వాటిని ప్రజా రహదారులపై ఉపయోగించడం చట్ట విరుద్ధం. ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ శబ్దాలు రావడం వల్ల శబ్దకాలుష్యం మాత్రమే కాకుండా తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఇలాంటి బైకులను రేస్ ట్రాక్ లలో మరియు ప్రయివేట్ ప్రదేశాలలో మాత్రమే ఉపయోగించాలి. ఇటువంటి ఎగ్జాస్ట్‌లు ప్రజా రహదారులపై చాలా అవాంతరాలను సృష్టిస్తాయి మరియు శబ్ద కాలుష్యం స్థాయిని కూడా పెంచుతాయి. అనేక రాష్ట్రాల్లో, పోలీసులు డెసిబెల్ మీటర్ వంటివి ఉపయోగించి శబ్దం స్థాయిని కొలవడానికి మరియు నియమాన్ని ఉల్లంఘించేవారికి జరిమానా విధించడానికి శాస్త్రీయ పరికరాలను ఉపయోగించడం ప్రారంభించారు.

Image Courtesy: SirsaPost/YouTube

Most Read Articles

English summary
Royal Enfield rider fined Rs 23,000 for LOUD exhaust: Bike SEIZED [Video]. Read in Telugu.
Story first published: Tuesday, February 25, 2020, 15:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X