Just In
- 10 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 12 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 12 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 14 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !
భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు మెల్ల మెల్లగా కోలుకుంటోంది. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఆగస్టు అమ్మకాలు సుమారు 25.43% పెరిగాయి. అదేవిధంగా జూలైలో రాయల్ ఎన్ఫీల్డ్ 37,925 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఆగస్టులో రాయల్ ఎన్ఫీల్డ్ 50,144 యూనిట్లను విక్రయించింది. 2019 ఆగస్టులో 52,904 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 2% పడిపోయాయి. గత ఏడాది ఆగస్టులో కంపెనీ దేశీయ మార్కెట్లో 48,751 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఈ సంఖ్య 47,571 యూనిట్లకు చేరుకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎగుమతులు 38% క్షీణించాయి. గత ఏడాది 4,152 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ 2,573 యూనిట్లను విక్రయించింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో కంపెనీ 1,47,747 యూనిట్లను విక్రయించింది. 2019 ఏప్రిల్ - ఆగస్టులో 2,90,798 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ గత ఏడాది 1,40,435 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాది 2,72,364 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

గత ఏడాది ఇదే కాలంలో 18,434 యూనిట్ల నుంచి ఎగుమతులతో 60% తగ్గి 7,312 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉండగా, ఈ సంవత్సరం నెల నెలకు మెరుగుపడుతోంది. రాబోయే రోజుల్లో మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవల కంపెనీ ఒకే రోజులో వెయ్యికి పైగా బైక్‌లను పంపిణీ చేసింది. దీనితో కంపెనీ రాబోయే పండుగ నాటికి మరింత అమ్మకాలను ఆశిస్తోంది. కొత్త బైక్‌లను విడుదల చేయడం వల్ల కంపెనీకి ఎక్కువ లాభాలు చేకూరుతాయి.
MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

రాయల్ ఎన్ఫీల్డ్ తన క్రూయిజర్ బైక్ థండర్బర్డ్ స్థానంలో కొత్త మెటియోర్ 350 బైక్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25-30 నాటికి ఈ బైక్ లాంచ్ అవుతుంది. కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై మెటియోర్ 350 బైక్ ఇంజిన్‌ను డిజైన్ చేసింది.

మెటియోర్ 350 ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్ నోవా అనే మూడు మోడళ్లలో విడుదల కానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఇతర బైక్‌ల కంటే మెటియోర్ 350 బైక్ మరింత అధునాతనంగా ఉంటుంది. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
MOST READ:హైస్పీడ్ వాహనాలను గుర్తించే హై-స్పీడ్ కెమెరాలు.. వచ్చేస్తున్నాయ్