ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

బెంగళూరుకి చెందిన మోటార్ సైకిల్స్ తయారీదారు అయిన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వారు ఒక కొత్త వాహనాన్ని ఆవిష్కరించారు. దీని పేరే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500. కొత్తగా సవరించిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 మోటార్ సైకిల్లో నియో-రెట్రో రూపాన్ని ఇచ్చే కస్టమ్ బిల్ట్ పార్ట్స్ ఉన్నాయి. వాహనం యొక్క ముందు భాగంలో కస్టమ్ బిల్ట్ ఫేస్ ప్లేట్, ట్విన్ హెడ్‌లైట్లు, 120 మి.మీ ప్రొపైల్ టైర్ మరియు స్పోక్డ్ వీల్స్, ఇంకా ఇందులో అప్-సైడ్ డౌన్ సస్పెన్షన్ కూడా ఉంటుంది.

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

మోటార్ సైకిల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ లో పరిమితి మార్పులతో కూడిన రెండు రేసింగ్ స్ట్రిప్స్, మరియు మూడు డెమెన్షినల్ క్యూబ్స్ ఉంటాయి. సవరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ 500 యొక్క సైడ్ ప్యానెల్స్‌లో కొత్త బ్రాట్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. ఇది ఉండటం వల్ల చాల శుభ్రంగా కనిపిస్తుంది. ఇందులో సీటు కూడా లెదర్ తో తయారు చేయబడి ఉంటుంది.

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

వెనుక సస్పెన్షన్ ఫ్యాక్టరీ ఇన్‌స్టాల్ చేసిన విలోమ గ్యాస్-ఛార్జ్ సెటప్‌ను కలిగి ఉంది. బుల్లెటర్ కస్టమ్స్ అసలు ఎగ్జాస్ట్ మెకానిజం నుండి అసలు బెండ్ పైపును కూడా కలిగి ఉంటుంది. కానీ మఫ్లర్ స్థానంలో అప్-స్వీప్ యూనిట్ తో భర్తీ చేయబడింది. బెండ్ పైపులకు మరొక యాడ్-ఆన్ బ్రౌన్ కలర్ హీట్ చుట్టలు చుట్టబడి ఉంటాయి.

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

మోటారుసైకిల్ యొక్క చివరలో 140 ఎంఎం సెక్షన్ టైర్‌తో పాటు వెనుక ఫెండర్ కోసం టైర్-హగ్గర్ ఉంటుంది. సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 మోటార్ సైకిల్ యొక్క ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది 499 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 27.2 బిహెచ్‌పి శక్తిని మరియు 41.3 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

ప్రస్తుత తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 మోడళ్ల ధర దాదాపు రూ. 2.16 లక్షలు వరకు ఉంటుంది. ఇవి ఏడాది మార్చి 31 వరకు మాత్రమే లభిస్తాయి. ఎన్‌ఫీల్డ్ యొక్క బుల్లెట్, క్లాసిక్ మరియు థండర్బర్డ్ 500 సిసి శ్రేణి మోటారుసైకిల్లను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది.

ఇప్పుడే చూడండి...మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

సవరించబడింది రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ 500 చూడటానికి చాల బాగుంటుంది. ఇది నేటి తరం యువకులను చాలా తొందరగా ఆకర్షించే విధంగా తయారుచేయబడింది. ఈ వాహనం యొక్క హెడ్‌లైట్ ల గురించి మాకు కచ్చితమైన సమాచారం తెలియదు. కానీ ఇది వినియోగదారునికి అనుగుణంగా తయారవుతుందని భావిస్తున్నాము.

Image Courtesy: Bulleteer Customs

Most Read Articles

English summary
This Modified Royal Enfield Thunderbird X Makes The Perfect Bond Getaway Ride. Read in Telugu.
Story first published: Saturday, January 25, 2020, 16:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X