Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆర్ఆర్ గ్లోబల్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్స్!
ముంబైకి చెందిన ప్రముఖ ఎనర్జీ కంపెనీ సంస్థ ఆర్ఆర్ గ్లోబల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై కన్నేసింది. ఈమేరకు భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తామని ఆర్ఆర్ గ్లోబల్ ప్రకటించింది. 'బిగాస్' (BGauss) బ్రాండ్ పేరుతో ముందుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఆర్ఆర్ గ్లోబల్ రూ.125 కోట్ల రూపాయలను వెచ్చించి ఓ వెంచర్‌ను ప్రారంభింస్తోంది. రానున్న మూడేళ్లలో ఈ నిధులతో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు మరియు అర్బన్ ప్రాంతాలే టార్గెట్‌గా తమ బిగాస్ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఈ విషయంపై ఆర్ఆర్ గ్లోబల్ డైరెక్టర్ మరియు బిగాస్ బ్రాండ్ వ్వవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన హేమంత్ కాబ్రా మాట్లాడుతూ.. తమ బిగాస్ బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయిగా ఉంటుందని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని అన్నారు. భారతదేశపు మార్కెట్ పరిస్థితులను తాము పూర్తిగా అర్థం చేసుకున్నామని, అందుకే తమ కేబుల్స్ అండ్ వైర్ వ్యాపారం ద్వారా భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపామని అన్నారు.
MOST READ: దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ అక్కడి వినియోగదారులు చాలా త్వరగా స్వీకరిస్తున్నారని, అదే విధంగా భారత మార్కెట్లో కూడా ఆ ట్రెండ్‌ని తాము గమనిస్తున్నామని, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయని, సిటీ ప్రయాణాల కోసం తమ బిగాస్ బ్రాండ్ స్మార్ట్ అండ్ సెన్సిబల్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్‌ని అందిస్తుందని హేమంత్ తెలిపారు.

ప్రారంభంలో భాగంగా ఆర్ఆర్ గ్లోబల్‌కి చెందిన బిగాస్ బ్రాండ్ రెండు ప్రొడక్షన్ మోడళ్లను భారత్‌కు పరిచయం చేయనుంది, వీటిలో ఐదు వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. పూనేలోని ఛాకన్ ప్లాంట్‌లో ఇప్పటికే బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.80,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
MOST READ: భారీగా పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు : ఎంతో తెలుసా

ఆర్ఆర్ గ్లోబల్ కంపెనీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 800 మిలియన్ డాలర్లు. ఈ సంస్థను 1986లో స్థాపించారు. ఇది తొలుత గుజరాత్‌లోని వడోదరా ప్లాంట్‌లో వైండింగ్ వైర్లను (మోటార్లలో ఉపయోగించే వైర్లు) తయారు చేసేది. ఈ సంస్తకు దేశవ్యప్తంగా 10 ఆపరేటింగ్ కంపెనీలు మరియు 28 మార్కెటింగ్ ఆఫీసులు ఉన్నాయి. వివిధ రకాలు వైర్లు, కేబుల్స్, మాగ్నెట్ వైర్స్, కాపర్ ట్యూబ్స్, ఎలక్ట్రోమెకానికల్ పార్కింగ్ సొల్యూషన్స్ వంటి విద్యుత్ సంబంధిత వ్యాపారాల్లో ఆర్ఆర్ గ్లోబల్‌కు మంచి పేరు ఉంది.

ఆర్ఆర్ గ్లోబల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భవిష్యత్తులో శిలాజ ఇంధనాలు అంతరించిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించిన ఆర్ఆర్ గ్లోబల్ బ్రాండ్ భవిష్యత్తులో మంచి విజయాన్ని దక్కించుకనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ కావటంతో ధర కూడా అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది.