Just In
Don't Miss
- Finance
2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక
- Movies
సుడిగాలి సుధీర్ తర్వాత అభిజీత్: బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో మరో రికార్డు.. దేశ వ్యాప్తంగా హైలైట్!
- News
సిక్కుల మనుగడకే ప్రమాదం: అమెరికాలో రోడ్డెక్కిన ఖలిస్తాన్: రాయబార కార్యాలయం ముట్టడి
- Lifestyle
బుధవారం దినఫలాలు : విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు.
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్.. ఈ స్కూటర్ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 230 కిలోమీటర్లు!
బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ కంపెనీ, సింపుల్ ఎనర్జీ అభివృద్ధి చేసిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్, పూర్తి చార్జిపై గరిష్టంగా 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఈ మైలేజ్ విషయాన్ని స్వయంగా ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధృవీకరించిందని కంపెనీ పేర్కొంది.

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ఈ స్కూటర్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించి ఒక బ్యాటరీ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకూ ప్రయాణించినట్లు ధృవీకరించింది. ఈ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎకో మోడ్‌లో పరీక్షించిన్నట్లు కంపెనీ ప్రకటించింది.

సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 కిలోవాట్ల అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని సింపుల్ ఎనర్జీ కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 100 కి.మీ. అవరోధాన్ని అధిగమించి, గరిష్టంగా గంటకు 103 కి.మీ వేగంతో పరుగులు తీయగలదని కంపెనీ తెలిపింది.
కంపెనీ రేట్ చేసిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఛార్జింగ్ సమయం వరుసగా హోమ్ ఛార్జర్ మరియు ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 40 నిమిషాలు 17 నిమిషాలుగా ఉంటుంది. ఇది కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 50 కి.మీ. వేగాన్ని చేరుకోగలదని కంపెనీ పేర్కొంది.
MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్‌ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !

ఈ ప్రోటోటైప్ స్కూటర్ ఉత్పత్తి దశకు చేరుకుని మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది మార్కెట్లో లభించే అత్యంత వేగవంతమైన ఈ-స్కూటర్లలో ఒకటిగా మారుతుంది. ఇది కనెక్టింగ్ టెక్నాలజీతో పాటుగా IP67-రేటెడ్ వాటర్‌ప్రూఫ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. సింపుల్ ఎనర్జీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీని 80 నుంచి 90 శాతం వరకూ స్థానికీకరించాలని చూస్తోంది.

సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకులు సుహాస్ మరియు శ్రేష్త్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క "మార్క్ 1" కాన్సెప్ట్‌ను సొంతంగా పూర్తి చేశారు. కాగా, ఈ బృందం ఇందులో ప్రొడక్షన్ మోడల్ అయిన ‘మార్క్ 2' ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది మరియు ఇందుకు సంబంధించి పెట్టుబడులను పెంచడానికి ప్లాన్ చేస్తోంది.
MOST READ:భారత్‌లో జీప్ రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడో తెలుసా?

సింపుల్ ఎనర్జీ భారత్‌లో తమ వ్యాపారం ప్రారంభించిన తర్వాత, తొలుతగా దేశంలోని రెండు చిన్న నగరాలతో పాటు ప్రధాన నగరాల్లో నాలుగు అనుభవ కేంద్రాలను (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్) కలిగి ఉండాలని యోచిస్తోంది. సర్వీస్ సెంటర్లతో కూడిన ప్రత్యేకమైన సింపుల్ ఎనర్జీ డీలర్‌షిప్‌లను కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఈ విషయంపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, "వినియోగదారులు కోరుకునే వాటికి మరియు వారు స్వీకరించే వాటికి మధ్య చాలా పెద్ద అంతరం ఉంది. గతంలో, భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం సుదూరమైన రేంజ్, వేగవంతమైన చార్జింగ్, ధరకు తగిన విలువ వంటి అంశాలను పరిష్కరించలేదు"
MOST READ:విడుదలకు సిద్దమైన కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; వివరాలు

"ఈ నేపథ్యంలో, మేము పై అంశాలను గుర్తించి, వాటిని సాధ్యం చేయటం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. మేము సింపుల్ ఎనర్జీని ఒక మిషన్‌తో ప్రారంభించాము మరియు ప్రజల నుండి మాకు వచ్చిన స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ స్కూటర్ ప్రీ-బుకింగ్ కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య 1000 మందికి పైగా ఉంది, ప్రస్తుతం మార్క్ 2 అభివృద్ధి దశలో ఉంద"ని ఆయన అన్నారు.

సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ 230 కిలోమీటర్ల రేంజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఏఆర్ఏఐ ధృవీకరించిన తాజా ఎలక్ట్రిక్ రైడింగ్ రేంజ్ గణాంకాల ప్రకారం, సింపుల్ ఎనర్జీ మార్క్ 2 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జీపై గరిష్టంగా 230 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను సాధించింది. ఏఆర్ఏఐ ధృవీకరించిన గణాంకాలతో, సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మరిత వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో ఈ భారీ రేంజ్ నిజమవుతుందో లేదో చూడాలి.
MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !