ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

మన దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి సహజ వనరులకు భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశం ఉండటం, ప్రస్తుతం వీటి ధరలు కూడా ఆకాశాన్నంటుతుండటంతో, భారత ఆటోమొబైల్ తయారీదారులు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవి) అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధాన రవాణా సాధానాలుగా మారుతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగంలా ఇప్పటికే అనేక కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి, ఇంకా కొన్ని కంపెనీలు ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెగ్యులర్ వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీలు కూడా మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని చేస్తున్నాయి.

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

తాజాగా, 'సింపుల్ ఎనర్జీ' అనే ఓ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించింది. 'మార్క్ 2' అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించిన సింపుల్ ఎనర్జీ కంపెనీ, ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ.1.3 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. రానున్న రోజుల్లో మరొక మిలియన్ డాలర్ల నిధులనును సేకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ:ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరనున్న రాఫెల్ ఫైటర్ జెట్స్ ; ఎందుకో తెలుసా

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

కోవిడ్-19 మహమ్మారి కారణంగా, 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే తమ కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. మార్క్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం బెంగుళూరులోని యలహంకలోని 50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ను కంపెనీ ప్రారంభిస్తోంది.

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ సంస్థను 24 ఏళ్ల సుహాస్ రాజ్‌కుమార్ స్థాపించారు. మార్క్ 2 స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా విక్రయించనున్నారు. దేశంలోని ప్రతి ప్రధాన నగరంలో నాలుగు ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లతో పాటుగా చిన్న నగరాల్లో రెండు ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లతో కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. సింపుల్ ఎనర్జీ సమీప భవిష్యత్తులో సర్వీస్ సెంటర్ల కోసం ప్రత్యేకమైన డీలర్‌షిప్‌లను కూడా ఏర్పాటు చేయనుంది.

MOST READ:అమెజాన్ పే ద్వారా కార్ & బైక్ భీమా మరింత సులభం, ఎలాగో తెలుసా ?

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ మార్క్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, మొదటి చూపులోనే ఆకట్టుకునే ఈ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన ఆధునిక డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 103 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి బ్యాటరీ చార్జ్‌పై గరిష్టంగా 280 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

ఇంత ఎక్కువ రేంజ్‌ను ఇప్పటి వరకూ ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లోనూ చూడలేదు. మార్క్ 2 స్కూటర్‌లో తొలగించగల తేలికపాటి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో ఇంట్లో అయితే 40 నిమిషాలు, ఛార్జింగ్ స్టేషన్ వద్ద అయితే 17 నిమిషాల్లో పూర్తిగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

పైన చెప్పినట్లుగా, మార్క్ 2 మూడంకెల గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. ఇధి కేవలం 3.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 50 కి.మీ వేగాన్ని చేరుకోగలదు. ఇంకా ఇందులో 4జి కనెక్టివిటీతో కూడిన ఏడు అంగుళాల టచ్ డిస్‌ప్లే (ఐపి 67 రేటింగ్‌తో) ఉంటుంది. ఈ స్కూటర్‌ను 80-90 శాతం భారతదేశంలోనే అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు.

ఒక చార్జ్‌పై 280 కి.మీ. రేంజ్, మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ మార్క్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మార్క్ 2 స్కూటర్ నెంబర్స్ చూస్తుంటే, నిజమేనా అనిపించేంత ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఒకవేళ కంపెనీ క్లెయిమ్ చేస్తున్న ఈ గణాంకాలు నిజమైతే, సింపుల ఎనర్జీ మార్క్ 2 ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది మరియు ఖచ్చితంగా అనేక మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. మార్కెట్లో ఈ స్కూటర్ ధర షుమారు రూ.1.10 నుండి 1.25 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

MOST READ:80 మీటర్లు దొర్లుకుంటూ వెళ్లినప్పటికీ బయటపడిన టాటా టియాగోలోని ప్రయాణికులు, ఎలానో మీరే చూడండి

Most Read Articles

English summary
Since our natural resources, petrol and diesel, are getting scarce and expensive day by day, manufacturers are focusing more on getting new Electric Vehicles (EV) in the Indian market. Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X