తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలలకు మోటార్ సైకిల్స్ మరియు కార్లు మొదలైనవి గిఫ్ట్స్ గా ఇవ్వడం ఇది వరకే చాలా చూసాము. కానీ ఇక్కడ ఒక తండ్రికి తన కొడుకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ని బహుమతిగా ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు.

తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు

తన తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన వీడియో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో మెషిన్ డైరీస్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తన తండ్రికి ఆ గిఫ్ట్ ఏ విధంగా ఇచ్చాడు అనేది మనం చూడవచ్చు.

తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు

తన తండ్రికి ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ బెంగళూరులోని ఇందిరా నగర్ లోని షోరూంలో బుక్ చేసుకోవడం జరిగింది. అతడు డెలివరీ తీసుకున్న తరవాత షోరూం బయట రైడింగ్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ బుక్ చేసుకున్న అతని తండ్రి మైసూర్ లో నివసిస్తున్నాడు. అతడు ఉన్న ప్రాంతం నుంచి డీలర్షిప్ కి 4 గంటల ప్రయాణ దూరం.

తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు

వ్లాగర్ మైసూర్‌కు బైక్‌పై రైడింగ్ చేస్తూ రాత్రి తన తండ్రి స్థానానికి చేరుకుని పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి తన తండ్రిని పిలుస్తాడు. అతను మోటారుసైకిల్‌ను తన తండ్రి కారు ముందు పార్క్ చేసి, తన తండ్రి వచ్చి తాను కొన్న బహుమతిని చూడటానికి ఎదురుచూస్తున్న స్తంభం వెనుక దాక్కున్నాడు. మోటారుసైకిల్ చూసిన తర్వాత తన తండ్రి చాలా ఆనందించాడు.

తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు

కొడుకు తాను మోటారుసైకిల్ తన కోసం బుక్ చేసాడని, డెలివరీ తీసుకున్న తర్వాత షోరూమ్ నుండి నేరుగా తన వద్దకు వచ్చాడని చెప్పాడు. ఇంతకు ముందే తన తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ చాల ఇష్టమైనది తెలుసుకున్నాడు.

తన తండ్రికి ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే కలర్ లో ఉంది. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారుచేయబడిన మోటార్ సైకిల్.

తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే తమ బిఎస్ 4 మోటార్ సైకిల్ అన్ని విక్రయించి, మైలు రాయిని సాధించిన దేశంలో మొదటి ద్విచక్ర వాహన బ్రాండ్. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లో 346 సిసి 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 19.8 బిహెచ్‌పి మరియు 28 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఇప్పుడు రూ. 1.67 లక్షలు (ఎక్స్‌షోరూమ్).

Source: Machine Diaries/YouTube

Most Read Articles

English summary
Son gifts dad a Royal Enfield Classic 350: Happiness all around [Video]. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X