Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహిళా రైడర్స్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ ; వివరాలు
వాహనదారులకు హెల్మెట్లు ఎంతగా ఉపయోగపడతాయో అందరికి తెలిసిన విషయమే, హెల్మెట్లు వాహనదారుల ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ కారణంగానే వాహదారులు తప్పకుండా ఐఎస్ఐ ధ్రువీకరించిన హెల్మెట్లను ధరించాలని చెబుతారు. సాధారణంగా హెల్మెట్లు పురుషులకు మాత్రం ఉంటాయి, ప్రత్యేకించి మహిళలకు ఉండటం చాలా అరుదు, కానీ ఇప్పుడు స్టీల్‌బర్డ్ సంస్థ మహిళల కోసం ప్రత్యేకంగా హెల్మెట్లను తయారు చేసింది.

హెల్మెట్ తయారీదారు స్టీల్‌బర్డ్ కొత్త హెల్మెట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కంపెనీ మహిళా రైడర్స్ కోసం ఈ హెల్మెట్లను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ హెల్మెట్లను ఇటలీలో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

స్టీల్‌బర్డ్ ఈ హెల్మెట్లను ఐఎస్ఐ మరియు యూరోపియన్ ప్రమాణాలచే ధృవీకరించబడింది. ప్రత్యేకమైన ఈ మహిళా హెల్మెట్లను ప్రారంభ ధర 1,149 రూపాయలకు విడుదల చేశారు. ఇందులో అనేక కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
MOST READ:అప్పుడే హ్యాక్ చేయబడిన HSRP అధికారిక వెబ్సైట్ ; తర్వాత ఏం జరిగిందంటే

స్టీల్‌బర్డ్ విడుదల చేసిన ఈ కొత్త హెల్మెట్ల యొక్క కలర్ అప్సన్స్ విషయానికి వస్తే, ఇందులో రెడ్, వైట్, బ్లూ, వైలెట్, పింక్, మెజెంటా కలర్స్ ఉన్నాయి. ఇది కాకుండా, ఈ హెల్మెట్ శ్రేణిని కంపెనీ అనేక డెకాల్స్‌తో విడుదల చేసింది. ఈ హెల్మెట్ అనేక పరిమాణాలలో ప్రవేశపెట్టబడింది.

దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం, స్టీల్‌బర్డ్ యొక్క ఈ హెల్మెట్స్ 520 మిమీ (ఎక్స్ఎక్స్ఎస్), 540 మిమీ (ఎక్స్ఎస్), 560 మిమీ (ఎస్), 580 మిమీ (ఎమ్) మరియు 600 మిమీ (ఎల్) లలో అందించబడింది. ఈ హెల్మెట్ల ఎయిర్‌వెంట్‌లపై ఎంబ్రాయిడరీ డిజైన్లను కూడా కంపెనీ అందించింది.
MOST READ:మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

మహిళలు ఈ హెల్మెట్లను తమ చీరలకు మ్యాచ్ అయ్యే విధంగా కూడా ఎంచుకోవచ్చు. ప్రత్యేకించి వీటిమీద ఉన్న ఎంబ్రాయిడరీని చూడటానికి ఇష్టపడతారు కాబట్టి ఈ హెల్మెట్లలో కూడా ఈ డిజైన్ ఇవ్వబడింది అని కంపెనీ పేర్కొంది. ఈ హెల్మెట్ లో ఆకులు మరియు పువ్వుల వంటి ఎంబ్రాయిడింగ్ చూడవచ్చు. మహిళా రైడర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ ఆకారం రూపొందించబడింది.

ఈ కొత్త హెల్మెట్స్ గురించి స్టీల్‌బర్డ్ ఎండి, రాజీవ్ కపూర్ మాట్లాడుతూ, ఈ హెల్మెట్స్ లో భద్రత అనేది ఏ మాత్రం రాజీపడకూడదు. ఈ భద్రతలో ఏ మాత్రం రాజీపడే అవకాశం లేదు. హెల్మెట్ అనేది ద్విచక్ర వాహనాలతో ప్రయాణించే వారికి చాలా అవసరమైనది కావున ఇది అత్యంత సురక్షితమైనదిగా తయారుచేయబడింది.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

ప్రత్యేకంగా మహిళల కోసం తయారుచేసిన ఈ హెల్మెట్ల మోడల్ దాని అద్భుతమైన డిజైన్, హెల్మెట్ డెకరేషన్, సేఫ్టీ మరియు దృఢమైన నిర్మాణం కారణంగా విజయవంతం కావడం ఖాయం అని ఆయన అన్నారు.

మహిళల కోసం ఈ హెల్మెట్లు వారి రూపానికి భిన్నంగా ఉండటమే కాకుండా వారి రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాగే, ఈ హెల్మెట్ పురుషులకు కూడా డిజైన్లు మరియు లక్షణాలను కలిగి ఉంది.
MOST READ:ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

అంతే కాకుండా ఇవి మహిళల కోసం తక్కువ బరువుతో తయారుచేయబడి ఉంటాయి. ఇవి చూటడానికి చాలా అందంగా ఉంటుంది మరింత స్టైలిష్ గా కనిపించింది మరియు మహిళలు ధరించడానికి చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది. సంస్థ యొక్క రాబోయే మోడల్ ప్రపంచవ్యాప్త సర్వే నిర్వహించిన తర్వాత రూపొందించబడింది. ఈ హెల్మెట్ ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా మహిళా రైడర్లతో విస్తృతమైన పరిశోధన రూపకల్పన మరియు చర్చల ఫలితం.