సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా సరికొత్త యాక్సెస్ 125 స్కూటర్‌ను ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2020 సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 స్కూటర్ స్టాండర్డ్ మరియు స్పెషల్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 64,800 మరియు రూ. 68,500 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ వేరియంట్ మళ్లీ మూడు విభిన్న ఆప్షన్లలో లభిస్తోంది. అవి, అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్ మరియు స్టీల్ డ్రమ్ బ్రేక్. ఇదే విధంగా స్పెషల్ వేరియంట్ కూడా అల్లాయ్ డిస్క్ బ్రేక్ మరియు అల్లాయ్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్లలో లభిస్తోంది.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

"ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ‌ఇంజన్ అప్‌గ్రేడ్ చేసి, గడువులోపే కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాము. సుజుకి యాక్సెస్ 125 మోడల్ ఇండియన్ మార్కెట్లో సుజుకి మోటార్‌సైకిల్స్ సక్సెస్‌లో కీల పాత్ర పోషిస్తోందని" సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా అధిపతి కోయిచిరో హిరావో చెప్పుకొచ్చారు.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

2020 సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో బిఎస్-6 బ్రాండ్ న్యూ ఇంజన్ వచ్చింది. కంపెనీ ప్రవేశపెట్టిన తొలి బిఎస్6 మోడల్ యాక్సెస్ 125 కావడం గమనార్హం. ఇందులో ఉన్న 124సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 10ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

బిఎస్6 వెర్షన్ సుజుకి యాక్సెస్‌ 125లో సుజుకి వారి ఇకో పర్ఫామెన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇది అద్భుతమైన పవర్ అవుట్‌పుట్ మరియు అత్యుత్తమ మైలేజ్ ఇవ్వడంలో సహాయపడుతుంది.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

యాక్సెస్ 125 స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, బయటి వైపున్న ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మీద ఇకో అసిస్ట్ ఇల్యుమినేషన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ వంటి అత్యాధునిక టెక్నాలజీ వచ్చింది.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

సుజుకి తమ యాక్సెస్ 125 స్కూటర్ డిజైన్ కూడా స్వల్పంగా మార్చింది. కాళ్ల దగ్గర స్పేస్ పెరిగేలా ఫుట్ బోర్డును రీ డిజైన్ చేశారు, మెరుగైన అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం, స్కూటర్ చుట్టూ క్రోమ్ సొబగులు, సౌకర్యవంతమైన పెద్ద సీటు మరియు లేటెస్ట్ బాడీ గ్రాఫిక్స్ వచ్చాయి.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

2020 సుజుకి యాక్సెస్ 125 రకరకాల రంగుల్లో లభిస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ పర్ల్ డీప్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, పర్ల్ మిరేజ్ వైట్, గ్లాస్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే అనే ఐదు రంగుల్లో ఎంచుకోవచ్చు.

యాక్సెస్ 125 స్పెషల్ వేరియంట్ మెటాలిక్ బోర్డియాక్స్ రెడ్, మెటాలిక్ డార్క్ గ్రీనిష్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ మరియు పర్ల్ మిరేజ్ వైట్ అనే నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తోంది.

సుజుకి యాక్సెస్ 125 బిఎస్6 వచ్చేసింది: వేరియంట్లు & ధరలు..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యాక్సెస్ 125 స్కూటర్ సుజుకి టూ వీలర్స్ శ్రేణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. 125సీసీ సెగ్మెంట్లో అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది. ఏప్రిల్ 01, 2020 నుండి అమలు కానున్న బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా యాక్సెస్ 125 స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేశారు. సుజుకి నుండి వచ్చిన తొలి బిఎస్6 టూవీలర్ కూడా ఇదే.

సుజుకి యాక్సెస్ 125 విపణిలో ఉన్న హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎన్‌టార్క్ 125, యమహా ఫ్యాసినో 125 మరియు హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
New (2020) Suzuki Access 125 BS-VI Scooter Launched In India: Prices Start At Rs 64,800. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X