సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

జపాన్ దిగ్గజం సుజుకి, దేశీయ మార్కెట్లోకి తమ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను బీఎస్6 వెర్షన్‌లో మళ్లీ లాంచ్ చేసింది. సరికొత్త బీఎస్6 వెర్షన్ సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ప్రీమియం స్కూటర్ ధర రూ. 77,900 ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. అత్యాధునిక ఫీచర్లతో పాటు మరెన్నో లేటెస్ట్ అప్‌డేట్స్ ఇందులో వచ్చాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 మోడల్‌లో కొత్తగా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చింది. మునుపటి తరహా కార్బోరేటర్ మాదిరిగా కాకుండా పెట్రోల్‌ను డైరక్ట్‌గా ఇంజన్‌ సిలిండర్‌లోకి ఇంజెక్ట్ చేస్తుంది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టార్ట్ అండ్ కిల్ స్విచ్ వచ్చింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

ఇందులోని ఇంజన్ స్టార్ట్ అండ్ కిల్ స్విచ్ సుజుకి వారి ఈజీ స్టార్ట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది ట్రాఫిక్‌లో అత్యంత త్వరగా స్టార్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. బీఎస్6 బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో అత్యంత ప్రకాశవంతమైన అధునాతన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ వచ్చింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో మరియు బాడీ ప్యానల్స్ మీద క్రోమ్ హైలైట్స్ వచ్చాయి. ఫ్రంట్ డిజైన్‌లో బాడీ మౌంటెడ్ లార్జ్ విండ్ స్క్రీన్ మరియు కాస్త పైవైపుకు మళ్లించినట్లు ఉంటే ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటివి ప్రధానంగా నిలిచాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

2020 సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్‌ స్కూటర్‌లో ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ మరియు ఇందులో డీసీ ఎలక్ట్రిక్ సాకెట్ కలదు. దీంతో రైడర్లు తమ మొబైల్ ఫోన్లను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సేఫ్టీ కోసం ఇందులో అత్యంత మెరుగైన కాంబి బ్రేకింగ్ టెక్నాలజీ కూడా వచ్చింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

సరికొత్త బీఎస్6 వెర్షన్ సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో సాంకేతికంగా అదే మునుపటి 124సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. ఇది 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్తగా అందించిన ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా స్కూటర్ చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

2020 సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ఇప్పుడు మెటాలిక్ మ్యాట్ బోర్డాక్స్ కలర్ అనే కొత్త కలర్‌లో లభిస్తోంది. దీంతో పాటు పర్ల్ మిరేజ్ వైట్, మ్యాట్ ఫైబ్రియోన్ గ్రే, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ రంగుల్లో కూడా దీనిని ఎంచుకోవచ్చు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ బీఎస్6 వెర్షన్ ప్రారంభ ధర రూ. 77,000. దేశవ్యాప్తంగా అన్ని సుజుకి షోరూముల్లో దీని మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా స్టార్ట్ చేసారు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

సుజుకి సంస్థకు సంభందించిన ఇటీవల వార్తలు పరిశీలిస్తే, యాక్సెస్ 125బీఎస్6 మోడల్ స్కూటర్‌ను రూ. 64,800 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ఈ మోడల్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బీఎస్6 వెర్షన్ విడుదల: ధర రూ. 77,900

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 అనేది ఎంట్రీ లెవల్ మ్యాక్సీ స్కూటర్. బీఎస్6 రాకతో బీఎస్4 మోడల్ కంటే ఆశించిన సేల్స్ సాధిస్తుందని భావిస్తున్నాము. ఇండియన్ కస్టమర్లకు ప్రీమియం లుక్, లగ్జరీ ఫీలింగ్‌నిచ్చే చీపెస్ట్ స్కూటర్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్. కానీ, వాస్తవానికి మ్యాక్సీ స్కూటర్లు ఇండియన్ మార్కెట్లో సక్సెస్ కాలేకపోతున్నాయి. అందుకు కైనటిక్ బ్లేజ్ స్కూటర్ కూడా ఒక ఉదాహరణ.

Most Read Articles

English summary
Suzuki Burgman Street 125 BS6 Model Launched In India At Rs 77,900. Read in Telugu.
Story first published: Tuesday, February 18, 2020, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X