Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఆధారంగా ఎలక్ట్రిక్ స్కూటర్ రానుందా? స్పై పిక్స్
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి, త్వరలో భారత మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇండియా టుడే ఇటీవల లీక్ చేసిన చిత్రాల ప్రకారం, ప్రస్తుతం సుజుకి బ్రాండ్ విక్రయిస్తున్న బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ఆధారంగా కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్టింగ్ చేయటాన్ని మనం గమనించవచ్చు.

సుజుకి తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రస్తుతం భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. వాస్తవానికి, మొదటి చూపులో ఈ స్కూటర్ సాధారణ బుర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మోడల్‌గానే అనిపిస్తుంది. అయితే, దగ్గరగా పరిశీలించినప్పుడు ఇది బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అని తెలుస్తుంది.

సుజుకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ వాహనం యొక్క వివరాలను దాచేందుకు కంపెనీ దాని బ్యాడ్జ్ మరియు లోగోలను వైనల్‌తో కప్పివేసింది. అయితే, మిగిలిన బాడీ మొత్తం వైట్ అండ్ బ్లూ కలర్‌లో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లా అనిపిస్తుంది.
MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

ఈ టెస్టింగ్ వాహనం ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పడానికి మరొక సంకేతం కూడా ఉంది, అదే ఇందులో సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ లేకపోవడం. అంతే కాకుండా, ఈ స్కూటర్ రెండు చివర్లలో కొంచెం భిన్నమైన సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది, అలాగే దీని వెనుక భాగంలో టైర్ హగ్గర్ కూడా కనిపిస్తుంది.

పైన పేర్కొన్న మార్పులు మినహా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని అన్ని ఇతర డిజైన్ అంశాలు స్టాండర్డ్ సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మాక్సి స్కూటర్ మాదిరిగానే అనిపిస్తుంది. కాగా, సుజుకి ఇంకా తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు, కాబట్టి ఈ మోడల్ వివరాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
MOST READ:ఈ కార్లు ఎంతో పాపులర్, అసలు ఇవున్నాయని మీకు తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ మరియు టీవీఎస్ వంటి పాపులర్ టూవీలర్ బ్రాండ్లు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో, సుజుకి కూడా ఇదే బాటలో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుజుకి నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టివిఎస్ ఐక్యూబ్ మరియు ఈథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పైన పేర్కొన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే అదే విధమైన ఫీచర్లు, రేంజ్, పెర్ఫార్మెన్స్ వంటి గణాంకాలను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సుజుకి ఇటీవల బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే.
MOST READ:బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈ నేపథ్యంలో, సుజుకి నుండి రాబోయే బర్గ్‌మ్యాన్ ఆధారిత కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఈ ఫీచర్‌ను అందుకుంటుందని మేము భావిస్తున్నాము. వీటితో పాటుగా ఎల్‌ఈడి లైటింగ్, పెద్ద బూట్ స్పేస్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు విశాలమైన మరియు సౌకర్యవంతమైన సీట్లు మొదలైన ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుతానికి ఈ స్పై చిత్రాలు మినహా సుజుకి నుండి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే, మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిశీలిస్తే, సుజుకి కూడా త్వరలోనే ఈవీ విభాగంలోకి ప్రవేశిస్తుందని మేము ఆశిస్తున్నాము.
Source: India Today
MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !