సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ జిక్సర్ శ్రేణి మోటార్‌సైకిల్‌కు కొత్త రంగులను జోడించనుంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఇటీవలే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ టీజర్ ఇమేజ్‌ను కూడా విడుదల చేసింది.

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

సుజుకి విడుదల చేసిన టీజర్ ఇమేజ్‌ను #బోర్న్ఆఫ్‌గ్రేట్‌నెస్ (#BornOfGreatness) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో సుజుకి జిక్సర్ శ్రేణిలో మొత్తం నాలుగు మోటార్‌సైకిళ్ళు మరియు రెండు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

వీటిలో సుజుకి జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ మోడళ్లు 155సిసి ఇంజన్‌తో లభిస్తుండగా, జిక్సర్ 250 మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడళ్లు 249సిసి ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి.

MOST READ:ఏథర్ 450 ఎక్స్ కలెక్టర్ ఎడిషన్.. డెలివరీ పొందే అదృష్టవంతులు ఎవరు?

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

సుజుకి జిక్సర్ సిరీస్‌లో కొత్తగా రాబోయే కలర్ ఆప్షన్ల గురించి కంపెనీ మరిన్ని వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ శ్రేణిలో అందుబాటులో ఉన్న నాలుగు మోడళ్లలో కూడా సుజుకి కొత్త కలర్ ఆప్షన్లను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

ఎంట్రీ లెవల్ సుజుకి జిక్సర్ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్ మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ అనే మూడు రంగులో లభిస్తుంది. గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్ మరియు మోటో జిపి ఎడిషన్ అనే మూడు రంగులలో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ లభిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ఇప్పుడు సియట్ టైర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

ఇకపోతే, ఇందులో శక్తివంతమైన సుజుకి జిక్సర్ 250సీసీ మోడళ్లు రెండూ కూడా డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తున్నాయి. ఇందులో ఫ్లాగ్‌షిప్ జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడల్ మోటో జిపి ఎడిషన్‌తో సహా మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, ఇవి చాలా ఆకర్షనీయంగా కనిపిస్తాయి.

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

సుజుకి జిక్సర్‌లో కొత్త కలర్ ఆప్షన్లు ఈ నెలాఖరులోగా విడుదల అవుతాయని అంచనా. ఇవి స్టాండర్డ్ కలర్ ఆప్షన్ల కంటే కొంచెం ప్రీమియం ధరను ఆకర్షించవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ధర మోటో జిపి ఎడిషన్‌లో కనిపించే వాటి కంటే తక్కువగానే ఉండొచ్చని సమాచారం.

MOST READ:దేవెగౌడకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన లగ్జరీ కార్, ఇదే.. చూసారా ?

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

సుజుకి జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ మోడళ్లలో 155సిసి, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

ఇకపోతే, సుజుకి జిక్సర్ 250 మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడళ్లలో 249సిసి, ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9300 ఆర్‌పిఎమ్ వద్ద 26 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7300 ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్4 మోడళ్ల కంటే 0.4 ఎన్ఎమ్ తక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:వెంబడించిన పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 70 కి.మీ డ్రైవ్ చేసిన ట్రక్ డ్రైవర్, చివరికి ఏమైందంటే?

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ ఆప్షన్స్; టీజర్ లాంచ్

సుజుకి జిక్సర్ కొత్త కలర్ ఆప్షన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సుజుకి మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో తమ పాపులర్ జిక్సర్ శ్రేణి మోటార్‌సైకిల్‌కు కొత్త రంగులను జోడించడం ద్వారా ఈ మోడల్ అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Suzuki Motorcycle India will be adding new colours to its Gixxer range of motorcycle in the Indian market. It has recently released a teaser image on its social media handles confirming the news. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X