పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

సుజుకి మోటార్‌సైకిల్ అందిస్తున్న పాపులర్ జిక్సర్ ఎస్ఎఫ్250 మోటార్‌సైకిల్ ఇప్పుడు ముంబై పోలీసుల పెట్రోలింగ్ వాహనంగా మారింది. ముంబై పోలీసులు తమ వాహనాల సముదాయంలో కొత్తగా 10 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోటార్‌సైకిళ్లను జోడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో భాగంగా పెట్రోలింగ్‌కు సహాయం చేయడానికి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ 250 సిసి మోటార్‌సైకిళ్లను అప్పగించింది.

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

ఈ సంస్థ ఇప్పటికే రెండు మోటార్‌సైకిళ్లను సూరత్, విజయవాడ పోలీసు విభాగానికి కూడా అందజేసింది. పెట్రోలింగ్ అధికారి అవసరాలను తీర్చడానికి ఈ మోటార్ సైకిళ్ళను కస్టమైజ్ చేయబడ్డాయి. రెగ్యులర్ జిక్సర్ ఎస్ఎఫ్250 మోడళ్లతో పోల్చుకుంటే ఇవి కాస్తంత భిన్నంగా ఉంటాయి.

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

ముంబై పోలీసులకు అప్పగించిన మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకమైన వైట్ కలర్‌లో పెయింట్ చేశారు. సాధారణ మోటారుసైకిళ్లలో ఈ కలర్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇంధన ట్యాంక్ ఎరుపు రంగులో POLICE అని ప్రింట్ చేసిన సైడ్ డెకాల్స్ ఉంటాయి.

MOST READ:పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

మోటార్‌సైకిల్ ముందు భాగంలో ఎరుపు మరియు నీలం రంగులో ఉండే బీకాన్‌లను ఫ్రంట్ ఫెయిరింగ్‌కు ఇరువైపులా అమర్చారు. వీటిని రైడ్ చేసే అధికారికి అదనపు రక్షణను అందించడానికి దీని విండ్‌స్క్రీన్‌ను పెద్దదిగా డిజైన్ చేశారు. విండ్‌స్క్రీన్ పైభాగంలో నలుపు మరియు తెలుపు రంగులలో ఫినిష్ చేసిన POLICE డెకాల్స్ ఉంటాయి.

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

మోటారుసైకిల్ వెనుక భాగంలో ఇరువైపులా రెండు పన్నీర్ స్టోరేజ్ బాక్స్‌లు అమర్చబడి ఉంటాయి. ఈ బాక్సులలో పెట్రోలింగ్ అధికారులు ఉపయోగించే సామాను స్టోర్ చేసుకోవచ్చు. ఇవి రెండూ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ స్కీమ్‌లో డిజైన్ చేయబడి ఉంటాయి. పెట్రోలింగ్ వాహనంలో పన్నీర్ బాక్స్ పక్కన ఉంచిన పోల్‌పై నీలిరంగు బీకన్స్ కూడా ఉంటాయి.

MOST READ:లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో 249 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్ ఇంటర్‌-కూలర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9,300 ఆర్‌పిఎమ్ వద్ద 26.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,300 ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి, ఇది డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇతర ఫీచర్లను గమనిస్తే, ఈ మోటార్‌సైకిల్ అంతటా ఎల్ఈడి లైటింగ్ మరియు రైడర్‌కు అనేక రకాల సమాచారాన్ని అందించే ఎల్‌సిడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.

MOST READ:బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియాకు సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తమ గుర్గావ్ ప్లాంట్ నుండి 50వ లక్ష మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ 50వ లక్ష వాహనం సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బిఎస్6 మోటోజిపి ఎడిషన్ కావటం విశేషం.

పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

ముంబై పోలీసుల కొత్త పెట్రోలింగ్ వాహనం సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశానికి సేవ చేయడంలో భాగంగా, పోలీసు అధికారుల కోసం 10 జిక్సర్ మోటార్‌సైకిళ్లను ఉచితంగా ఇచ్చింది. దేశంలోని వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి కస్టమ్ మేడ్ మోటార్‌సైకిళ్లను క్రమం తప్పకుండా అందించడం ద్వారా కంపెనీ తమ సిఎస్‌ఆర్ కార్యక్రమాలను అనుసరిస్తోంది. పెట్రోలింగ్ అధికారులకు సహాయపడేలా ఈ మోటార్‌సైకిళ్లను భారీగా కస్టమైజ్ చేశారు.

MOST READ:సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]

Most Read Articles

English summary
Mumbai Police receives 10 Gixxer SF 250 motorcycles to their fleet of vehicles. Suzuki Motorcycle India handed over the 250cc motorcycle to help with patrolling as a part of brand's (CSR) Corporate Social Responsibility. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X