పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్ ఈ ఏడాది ఆరంభంలో తమ సరికొత్త బిఎస్6 కంప్లైంట్ 'సుజుకి ఇంట్రుడర్' మోటార్‌సైకిల్‌ను రూ.1.20 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు ఈ మోడల ధరను స్వల్పంగా పెంచారు.

పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

సుజుకి ఇంట్రుడర్ ఇప్పుడు రూ.1,22,141 ప్రారంభ ధరతో లభ్యం కానుంది. అంటే ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధరపై కంపెనీ రూ.2,141 మేర పెంచింది. సుజుకి ఇంట్రుడర్ బిఎస్6 క్రూయిజర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌ వెడల్పాటి హ్యాండిల్ బార్స్, పెద్ద ట్యాంక్ కవర్స్, లో-స్లంగ్ డిజైన్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ సీట్లు మరియు డ్యూయెల్ మఫ్లర్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. ఇందులో పిలియన్ కంఫర్ట్ కోసం బ్యాక్‌రెస్ట్ కూడా ఉంటుంది.

పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

ఇంజన్ పరంగా గమనిస్తే, కొత్త బిఎస్6 సుజుకి ఇంట్రుడర్ మోడల్‌లో 154.9 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అన్ని వేరియంట్లలో ఇది బ్రాండ్ యొక్క ఎస్ఈపి (సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్) టెక్నాలజీ మరియు ఫ్యూయెల్ ఇంజెక్షన్‌ టెక్నాలజీలను కలిగి ఉంటుంది.

పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్ (ఎస్ఈపి) టెక్నాలజీతో తయారైన ఈ మోటారుసైకిల్‌ను మెరుగైన పనితీరును అందిస్తూనే, మంచి ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. కొత్త సుజుకి ఇంట్రుడర్ బిఎస్6 మూడు రంగులో (మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / క్యాండీ సొనోమా రెడ్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్ / మెటాలిక్ మ్యాట్ సిల్వర్ మరియు మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్) లభిస్తుంది.

పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

సుజుకి మోటార్‌సైకిల్ ఇటీవల యాక్సెస్ 125 స్కూటర్ మరియు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ బిఎస్6 స్కూటర్ల ధరలను కూడా పెంచింది. ఈ రెండు స్కూటర్ల ధరలు సుమారు రూ.1,800 మేర పెరిగాయి. యాక్సెస్ 125 బిఎస్6 స్కూటర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ మాత్రం ఒకే వేరియంట్లో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ యాక్సెస్ 125 ట్రిమ్ ధర ఇప్పుడు రూ.68,000 కాగా, టాప్-స్పెక్ స్పెషల్ ఎడిషన్ ధర రూ.73,400 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి..

పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

ఇకపోతే ఒక్క వేరియంట్‌లో మాత్రమే లభించే బర్గ్‌యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ధర రూ.79,700, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ అనేది మాక్సి స్టైల్ స్కూటర్, ఇది గరిష్ట స్థలాన్ని మరియు సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. ఇలాంటి ఫీచర్లను కోరుకునే 125 సిసి సెగ్మెంట్ స్కూటర్లను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను అందిస్తున్నారు.

పెరిగిన సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర - పూర్తి వివరాలు

సుజుకి ఇంట్రుడర్ మోటార్‌సైకిల్ ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న మోడళ్లలో సుజుకి ఇంట్రుడర్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ మోడల్ ప్రారంభ ధరను పరిగణలోకి తీసుకుంటే తాజాగా పెరిగిన ధర నామ మాత్రంగానే ఉందనేది మా అభిప్రాయం.

More from DriveSpark

Article Published On: Friday, July 10, 2020, 12:30 [IST]
English summary
Suzuki Motorcycles had launched the BS6-compliant Intruder earlier this year in India at a starting price of Rs 1.20 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+