Just In
- 17 min ago
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- 22 min ago
భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు
- 2 hrs ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 3 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
Don't Miss
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుజుకి కటన ఈ ఏడాది ఇండియాకి రానట్టే.. ఎందుకో తెలుసా..!
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనతయారీదారులలో సుజుకి ఒకటి. సుజుకి నుంచి ఇప్పటికే మంచి ఆకర్శణీయమైన వాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పుడు సుజుకి బ్రాండ్ అయిన కటన ఈ సంవత్సరం ఇండియన్ మార్కెట్ కి రావడం లేదు. ఈ సుజుకి కటన బైక్ ఎందుకు రావడం లేదు అనే విషయాన్ని గురించి మరింత తెలుసుకుందాం!

సుజుకి 1981 లో మొదటి సారిగా కటన బైక్ ని ప్రవేశపెట్టింది. దీని ఉత్పత్తి దాదాపు 2006 వరకు కొనసాగింది. కానీ ఈ సంవత్సరం కటన ఇండియాకి రావడం లేదు. ఎందుకంటే 2020 ఆటో ఎక్స్పో సందర్భంగా, సుజుకి మొదటిసారిగా తమ దేశీయ మోటార్‌సైకిళ్ల మొత్తం బిఎస్ 6 లైనప్‌ను ప్రదర్శించింది. కానీ సుజుకి కటన ఇక్కడ ప్రదర్శించలేదు.

సాధారణంగా ఎక్స్‌పోలో మోటార్‌సైకిల్‌ను ప్రదర్శించడం అంటే, త్వరలోనే ఈ ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కానీ కటన విషయంలో అలా జరగలేదు. ఆటోకార్ ఇండియా సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ "కొయిచిరో హిరావ్" మరియు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ "దేవాశిష్ హండా" 2020 కి ఈ మోటారుసైకిల్ భారతదేశానికీ తీసుకురాలేమని ప్రకటించారు.

ఈ సుజుకి కటన మోటార్ సైకిల్ ఇండియాకి రాకపోవడానికి ప్రధాన కారణం బిఎస్-6 కంప్లైంట్ కాదు. ప్రస్తుతం దీనిని కాలుష్య నివారణలకు అనుగుణంగా నవీనకరించదలచారు. తరువాత కస్టమర్ల ఆసక్తిని గమనించి దీనిని మార్కెట్లో విడుదల చేయడానికి సంకల్పించారు.

కస్టమర్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ మోటారుసైకిల్‌ను అప్డేట్ చేయడానికి కంపెనీకి కూడా సమయం అవసరమని హిరావ్ పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, 2021 లో సుజుకి కటన భారతదేశంలో ప్రారంభించవచ్చని తెలిపారు.

సుజుకి కటన బైక్ లో ఫీచర్స్ ని గమనించినట్లయితే దీని ముందు భాగంలో ఆల్ ఎల్ఇడి దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్ లభిస్తుంది, ఇది పాత మోడల్ రూపాన్ని అనుసరిస్తుంది. సుజుకి కటనలో ఏర్పాటు చేసిన సస్పెన్షన్ పూర్తిగా అడ్జస్టబుల్ కెవైబి 43 మిమీ యుఎస్డీ ఫోర్క్ మరియు ప్రీలోడ్ మరియు రీబౌండ్ డంపింగ్ కోసం అడ్జస్టబుల్ లింక్ టైప్ మోనోషాక్ యూనిట్ కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విధులను బ్రెంబో రేడియల్ కాలిపర్లు నిర్వహిస్తాయి.

సుజుకి కటన అదే 999 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది జిఎస్ఎక్స్-ఎస్ 1000 ఎఫ్‌కు శక్తినిస్తుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్పి మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 108 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాకుండా స్లిప్పర్-క్లచ్, త్రి లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ వంటివి ఉన్నాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సుజుకి కటన మోటార్ సైకిల్ చూడటానికి అద్భుతంగా కనిపించడమే కాకుండా దాని మునుపటి మోడల్ ను అనుసరిస్తుంది. ఇది భారతదేశంలో ప్రారంభించిన తరువాత మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుందని యాజమాన్యం ఆశిస్తుంది.