Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు
సుజుకి మోటార్ సైకిల్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్‌ను ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ కొత్త రంగులతో విడుదల చేయబడింది. ఈ సుజుకి స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మీ కోసం..

బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో వివిధ రంగులలో లభిస్తుంది. అవి గ్రే మెటాలిక్, మాట్టే బ్లాక్ మెటాలిక్ మరియు బ్రిలియంట్ వైట్ కలర్స్. మొదటి రెండు రంగులకు బదులుగా, టైటాన్ బ్లాక్ మరియు మాట్టే ప్లాటినం సిల్వర్ మెటాలిక్ అనే కొత్త రంగు ఎంపికను విడుదల చేశాయి.

కొత్త బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ కొత్త రంగులు తప్ప పెద్దగా ఏమి మార్చబడలేదు. కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్లో డ్యూయల్ సెటప్ మరియు ముందు భాగంలో విండ్‌స్క్రీన్ ఉన్నాయి. కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్లో పెద్ద సీటు ఉంది కాబట్టి రైడర్ కి చాలా అనుకూలంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించదానికి అనుగుణంగా ఉంటుంది.
MOST READ: తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

ఈ సుజుకి స్కూటర్ సీటు కింద భాగంలో ఎక్కువ స్థలం ఉంటుంది. చాలా స్థలం ఉన్నందున దాని లోపల రెండు హెల్మెట్లను ఉంచదానికి అనుకూలంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్ ధర రూ. 3.40 లక్షలు, అదే విధంగా బర్గమన్ స్ట్రీట్ 125 స్కూటర్ ధర రూ. 77,000 (ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.

124 సిసి ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ గల బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడింది. ఈ కొత్త స్కూటర్ లీటరుకు 54 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
MOST READ: లాక్డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్లో 199 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 18 బిహెచ్ పి శక్తిని మరియు 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. కొత్త బెర్గ్మన్ 200 స్కూటర్ లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజిన్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థను కూడా కలిగి ఉంది.

కొత్త సుజుకి బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. కొత్త బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
MOST READ: ఏవియేటర్ & గ్రాజియా ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకో తెలుసా.. ?