Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 5 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 5 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 7 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్లూటూత్ కనెక్టెడ్ కన్సోల్‌తో కొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న యాక్సెస్ 125 మరియు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్లలో ఇప్పుడు కొత్త వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఈ రెండు స్కూటర్లను కంపెనీ అప్‌డేట్ చేసింది.

సుజుకి యాక్సెస్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ రెండు మోడళ్లు కూడా ఇప్పుడు కొత్త బ్లూటూత్ కనెక్టెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో లభ్యం కానున్నాయి. కొత్త అప్‌డేట్‌తో పాటుగా ఈ రెండు స్కూటర్ల ధరలు కూడా మార్చబడ్డాయి. యాక్సెస్ 125 ప్రారంభ ధర ఇప్పుడు రూ.77,700 లుగా ఉంటే, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధర రూ.84,600 లుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ కొత్త అప్‌డేటెడ్ స్కూటర్లలోని బిల్ట్-ఇన్ బ్లూటూత్-కనెక్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అదనపు ఫీచర్లను కలిగి ఉండి, రైడర్‌కు కావల్సిన సమాచారాన్ని అందిస్తుంది. రైడర్స్ ఇప్పుడు బ్రాండ్ యొక్క ‘రైడ్ కనెక్ట్' యాప్ సాయంతో స్కూటర్ కన్సోల్‌కు కనెక్ట్ కావచ్చు, ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ కనెక్టెడ్ టెక్నాలజీలో కాలర్ ఐడితో మిస్డ్ కాల్ అలర్ట్, ఎస్ఎమ్ఎస్ మరియు వాట్సాప్ మెసేజ్ అలెర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫోన్ బ్యాటరీ ఇండికేటర్, ఈటిఏ అప్‌డేట్స్ వంటి పలు రైడర్ ఫీచర్లకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ యాప్ సాయంతో వాహన గణాంకాలు, ట్రిప్ షేరింగ్ సమాచారం, చివరిగా నిలిపిన ప్రదేశం వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా పొందవచ్చు.

ఈ రెండు స్కూటర్లు వివిధ రకాల కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. సుజుకి యాక్సెస్ 125 ఇప్పుడు మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మ్యాట్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ (నెంబర్ 2) మరియు పెరల్ మిరాజ్ వైట్ కలర్లలో లభిస్తుంది. అదేవిధంగా, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌ను మ్యాట్ బ్లూ, మెటాలిక్ మ్యాచ్ ఫైబ్రోయిన్ గ్రే, పెరల్ మిరాజ్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ (నెంబర్ 2) మరియు మెటాలిక్ మ్యాట్ బోర్డియక్స్ రెడ్ కలర్లలో లభిస్తుంది.
MOST READ: హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

పైన పేర్కొన్న అప్‌డేట్స్‌తో పాటు, సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఇప్పుడు దాని రెండు వేరియంట్లలో ఎల్ఈడి పొజిషనింగ్ లాంప్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. పైన పేర్కొన్న మార్పులు మినహా, ఈ స్కూటర్లలో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

ఇంజన్ విషయానికి వస్తే, ఈ రెండు స్కూటర్లు ఒకే రకమైన బిఎస్6 కంప్లైంట్ 124సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ: మహీంద్రా థార్‌కి పోటీగా మారుతి సుజుకి జిమ్నీ; భారత్‌లో ఉత్పత్తి ప్రారంభం!

బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మోడళ్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టూవీలర్లలో కనెక్టింగ్ టెక్నాలజీ ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన ఫీచర్లలో ఒకటిగా మారిపోయింది. భారత స్కూటర్ మార్కెట్‌లోని 125 సిసి విభాగంలో సుజుకి యాక్సెస్ మరియు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్లు చాలా ప్రసిద్ధమైన మోడళ్లు. ఇప్పుడు ఇవి కనెక్టింగ్ టెక్నాలజీతో వస్తున్న నేపథ్యంలో, ఇవి కస్టమర్లను మరింత ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంది. ఈ రెండు స్కూటర్లు ఈ విభాగంలో టీవీఎస్ ఎన్‌టోర్క్ 125 మరియు హోండా యాక్టివా 125 మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.