2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

జపాన్ ఆటో తయారీ దారు అయిన సుజుకి ఆటో ఎక్స్‌పో 2020 లో సుజుకి "కటన" మోటార్ సైకిల్ ని ఆవిష్కరించింది. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సుజుకి మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

1981 నుండి 2006 వరకు సుజుకి ప్రపంచ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది. తరువాత కాలంలో వీటి డిమాండ్ కొంచెం తగ్గింది. కానీ 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టిన సుజుకి కటన బైక్ తో మళ్ళీ దీనికి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు.

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

సుజుకి కటన మోటార్ సైకిల్ లో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 150 హెచ్‌పి శక్తిని మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 108 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన సుజుకి కటన చాల మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సుజుకి కటన ఈ సంవత్సరంలోనే ఇండియాలోకి సికెడి పేరుతో గా రావచ్చని సుజుకి యాజమాన్యం సూచించింది.

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

సుజుకి కటన బైక్ ప్రసిద్ధి చెందిన స్పోర్ట్స్ బైక్ లలో ఒకటిగా పరిగణించబడుతోంది. సుజుకి మోటార్ సైకిల్స్ వాహనదారులకు ఎంతో ఉత్సాహాన్ని చేకూరుస్తాయి. ఎందుకంటే ఈ వాహనాలు చూడటానికి చాల స్టైలిష్ గా ఉండటమే కాకుండా రైడర్లకు మంచి అనుభూతిని అందిస్తాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

ఇప్పుడు సుజుకి మోటార్ సైకిల్ కొంత స్టైలిష్ ఫీచర్ తో అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఉన్న ఎల్‌ఇడి హెడ్‌లైట్స్ బైక్ కి ఒక ఆకర్షణ తీసుకువస్తాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

సుజుకి కటన లో డిజైన్ చాల చక్కగా ఉంటుంది. ఈ డిజైన్ ట్యాంక్ మీదుగా దారితీసి తరువాత పదునైనదిగా కనిపిస్తుంది. వెనుక రూప కల్పనా మినిమలిక్‌గా ఉంటుంది.ఇందులో ఉన్న ట్యాంక్ సామర్థ్యము 12 లీటర్లు.

2020 ఆటో ఎక్స్‌పోలో కటన మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిన సుజుకి

సుజుకి కటన బైక్ లో స్లిప్పర్ క్లచ్, త్రి లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ వంటివి ఉన్నాయి. సస్పెన్షన్ హార్డ్‌వేర్‌లో పూర్తిగా అడ్జస్ట్ చేయగల కెవైబి 43mm USD ఫోర్క్ రీబౌండ్ డంపింగ్ కోసం అడ్జస్టబుల్ లింక్ టైప్, మోనోషాక్ యూనిట్ లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Suzuki Katana could launch in India as CKD. Read in Telugu.
Story first published: Friday, February 7, 2020, 19:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X