సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత్‌లో మరో కొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. గడచిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన కొత్త 2020 సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. బిఎస్6 అప్‌డేట్‌తో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ధరను రూ.8.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా) నిర్ణయించారు.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

ఈ టీజర్‌ను చూస్తుంటే, త్వరలో ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ లాంచ్‌కు ముందే, బిఎస్6 కంప్లైంట్ వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి మోడల్‌ని సుజుకి ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదల చేసింది. ఇదే మోడల్‌ను కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

ఈ కొత్త మోడల్‌లో కేవలం ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇది మునుపటి బిఎస్4 సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, బిఎస్6 మోడల్ బిఎస్4 మోడల్ కంటే రూ.1.4 లక్షల అధిక ధరను కలిగి ఉంది. కొత్త సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 ఇప్పుడు ఛాంపియన్ ఎల్లో నెంబర్ 2 మరియు పెరల్ గ్లాసీయర్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.

MOST READ:కొత్త ఫీచర్స్‌తో రానున్న 2021 రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ.. చూసారా!

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

అప్‌డేట్ చేసిన కొత్త సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌లో ఇదివరకటి బిఎస్4 మోడల్‌లో చూసినట్లుగానే అదే ఇంజన్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఉపయోగించారు. ఇందులోని 645 సిసి డిఓహెచ్‌సి వి-ట్విన్ ఇంజన్ 8800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 69.7 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 62 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఇబ్బంది లేని స్టార్టింగ్ కోసం సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్‌ను జోడించారు.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లతో షార్ప్ ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ ఎర్గోనామిక్స్, ఎత్తైన మరియు సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, నకల్ గార్డ్స్, ఇంజన్ ప్రొటెక్టర్ స్పోక్ వీల్స్, బాగా కుషన్ చేయబడిన సింగిల్-పీస్ సీట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో అదే 43 మిమీ సర్దుబాటు చేయగల టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్‌ను గమనిస్తే, ముందు భాగంలో 310 మిమీ ట్విన్ డిస్క్‌లతో ట్విన్-పిస్టన్ కాలిపర్స్ మరియు వెనుక వైపు 260 మిమీ సింగిల్ డిస్క్ సింగిల్-పిస్టన్ కాలిపర్ సెటప్ ఉంటుంది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్ వివిధ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో గేర్ స్థానం మరియు స్పీడోమీటర్ కోసం పెద్ద అనలాగ్ టాకోమీటర్ మరియు డిజిటల్ రీడౌట్లను కలిగి ఉంటుంది. దిగువ డిజిటల్ విభాగంలో ఓడోమీటర్, ట్విన్-ట్రిప్ మీటర్, గడియారం, ఇంధన స్థాయి, కూలెంట్ టెంపరేచర్ మరియు ట్రాక్షన్-కంట్రోల్ మోడ్‌లను ప్రదర్శిస్తుంది.

MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

సుజుకి ఇండియా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో కొత్త వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టితో సహా రెండు హై డిస్‌ప్లేస్‌మెంట్ బిఎస్6 మోటార్‌సైకిళ్లను కూడా ప్రదర్శించింది. ఎక్స్‌పోలో ప్రదర్శించిన వెంటనే, సుజుకి తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్‌లో వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 కోసం ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

అయితే, ఆ తర్వాతి కాలంలో దేశంలో నెలకొన్న కోవిడ్-19 మహమ్మారి మరియు దాని ఫలితంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ వంటి పరిస్థితుల కారణంగా, మార్కెట్లో వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోటార్‌సైకిల్ విడుదల జాప్యమైంది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో, కంపెనీ తమ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను తిరిగి ఇండియాలో విడుదల చేసింది.

MOST READ:కొత్త స్టైల్‌లో సోనెట్ ఎస్‌యూవీ డెలివరీ చేసినా కియా మోటార్స్.. ఎలాగో తెలుసా ?

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6ని విడుదల చేయటం ద్వారా బ్రాండ్ యొక్క బిగ్ బైక్ విభాగాన్ని కిక్‌స్టార్ట్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. కొత్త సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 దేశంలో పెరుగుతున్న అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిళ్ల డిమాండ్‌ను తీర్చనుంది. ఇది ఈ విభాగంలో కవాసాకి వెర్సిస్ 650 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Suzuki V-Strom 650XT BS6 Launched In India At Rs 8.84 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X