Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో విడుదలైన టాప్ 10 బెస్ట్ బైక్స్; మోడల్ వారీగా వివరాలు
మరికొద్ది రోజుల్లో 2020 సంవత్సరం ముగియనున్న సంగతి తెలిసినదే. ప్రపంచంలోనే ఈ 2020వ సంవత్సరం ఒక చీకటి సంవత్సరంగా మిగిలిపోనుంది. యావత్ ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి కుదిపివేసిన సంగతి తెలిసినదే. మనదేశంలో కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉంది.
భారతదేశంలో కోవిడ్ కారణంగా టూవీలర్ మార్కెట్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంది. దేశంలో మూడు నెలలకు పైగా లాక్‌డౌన్ విధించినప్పటికీ, టూవీలర్ కంపెనీలు తేరుకొని భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో అనేక కొత్త మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టాయి.

దేశంలోని వివిధ టూవీలర్ బ్రాండ్లు కొత్తగా ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ నుండి హై-ఎండ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, పెర్ఫార్మెన్స్ మరియు క్రూయిజర్ వంటి మోడళ్ల వరకూ విడుదల చేశాయి. ఇందులో కొన్ని సరికొత్త మోడళ్లు కాగా, మరికొన్ని రిఫ్రెష్డ్ వెర్షన్లు మరియు స్పెషల్ ఎడిషన్లు ఉన్నాయి.
మరి గడచిన సంవత్సరంలో దేశంలో వివిధ టూవీలర్ బ్రాండ్లు మార్కెట్లో ప్రవేశపెట్టిన ఆ టాప్-10 మోటార్‌సైకిళ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన సరికొత్త ఉత్పత్తి ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్. ఇదొక ఎంట్రీ లెవల్ నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ మరియు ఇది ఆధునిక ఫీచర్లు మరియు సాంకేతికతతో సరసమైన ధరకే లభిస్తోంది.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

హీరో మోటోకార్ప్ 160ఆర్ సింగిల్ డిస్క్ మరియు డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభం అవుతాయి. ఈ మోటారుసైకిల్‌లో 163 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 15 బిహెచ్‌పి పవర్‌ను మరియు 14 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విభాగంలో ఇది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మరియు సుజుకి జిక్సెర్ 155 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

హోండా హార్నెట్ 2.0
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా అందిస్తున్న హార్నెట్ 2.0 భారత మార్కెట్ కోసం ఈ బ్రాండ్ తీసుకొచ్చిన సరికొత్త మోడల్. భారతదేశంలో ‘హార్నెట్' పేరు కొంతకాలంగా అమ్మకానికి ఉండగా, ఇందులో కొత్తగా 2.0 పేరుతో కంపెనీ ఓ సరికొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
MOST READ:భారత్‌లో బెస్ట్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాప్-5 సేఫెస్ట్ కార్స్ ఇవే..

కొత్త హోండా హార్నెట్ 2.0 ఇప్పుడు పెద్ద 184 సిసి ఇంజన్‌తో లభిస్తుంది. ఇది మునుపటి 160సిసి కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ డిజైన్, స్టైలింగ్ ఇంజన్లను కంపెనీ పూర్తిగా రీడిజైన్ చేసింది. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్‌లో అనేక ఫీచర్లు, పరికరాలను జోడించింది.

మార్కెట్లో హోండా హార్నెట్ 2.0 ధర రూ.1.27 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఇందులో 184 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 17 బిహెచ్‌పి పవర్‌ను మరియు 16.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

KTM 250 అడ్వెంచర్
కెటిఎమ్ ఇటీవలే ప్రవేశపెట్టిన సరికొత్త మోడల్ 250 అడ్వెంచర్. భారతదేశంలో ఇది బ్రాండ్ యొక్క ఎంట్రీలెవల్ ఎడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా విడుదలైంది. కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ దాని పెద్ద 390 అడ్వెంచర్ మాదిరిగానే అదే డిజైన్ ఎలిమెంట్లను మరియు చాలా పరికరాలను ముందుకు తీసుకువెళుతుంది. అయితే, ఇంజన్‌ను మాత్రం 250 డ్యూక్ నుండి గ్రహించారు.

కెటిఎమ్ 250 అడ్వెంచర్ దాని డ్యూక్ 250 మాదిరిగానే ఒకేరకమైన పవర్ మరియు టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధర రూ.2.48 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఇది కెటిఎమ్ 250 డ్యూక్ కంటే కొంచెం ఖరీదైనది.
MOST READ:భారత్‌లో లక్షకు పైగా కనెక్టెడ్ కార్లను విక్రయించిన కియా మోటార్స్

హస్క్వర్నా 250 ట్విన్స్
స్వీడన్ బైక్ బ్రాండ్ హస్క్వర్నా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రారంభంలో భాగంగా కంపెనీ రెండు మోడళ్లను అందిస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ అనే రెండు మోడళ్లు లభిస్తున్నాయి. ఇవి 250 సిసి విభాగంలో విడుదలయ్యాయి.

హుస్క్వర్నా 250 ట్విన్స్, ఆస్ట్రియన్ బ్రాండ్ కెటిఎమ్ అంజిస్తున్న 250 డ్యూక్ మరియు 250 అడ్వెంచర్ మోడళ్ల మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి. అయితే, డిజైన్ పరంగా మాత్రం ఇవి రెండూ భిన్నంగా ఉంటాయి. మార్కెట్లో వీటి ప్రారంభ ధరలు రూ.1.85 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ నుండి ఎంతో పాపులర్ అయిన థండర్‌బర్డ్ క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ మీటియోర్ 350ని భారత మార్కెట్లో విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350ను కంపనెనీ సరికొత్త ఎస్ఓహెచ్‌సి 350సిసి ఇంజన్‌తో పాటు అనే కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో తయారు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.1.75 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న మొట్టమొదటి ఎస్ఓహెచ్‌సి మోటారుసైకిల్. భవిష్యత్తులో ఈ ఇంజన్‌ను ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లలో కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది.

హోండా హెచ్‌నెస్ సిబి 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్‌కి పోటీగా జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా ప్రవేశపెట్టిన సరికొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఈ హోండా హెచ్‌నెస్ సిబి 350. ఇది హోండా నుండి లభిస్తున్న పూర్తి సరికొత్త మోటారుసైకిల్, దీనిని భారత మార్కెట్ కోసం రూపొందించారు. హోండా హెచ్‌నెస్ సిబి 350ని హోండా ప్రీమియం బిగ్-వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. మార్కెట్లో దీని ధర రూ.1.85 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

హోండా హెచ్‌నెస్ సిబి 350లో శక్తివంతమైన 350సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కనెక్ట్ చేయబడిన టెక్నాలజీతో పాటు కొన్ని విశిష్టమైన ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్
కెటిఎమ్ విడుదల చేసిన మొదటి ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఈ 390 అడ్వెంచర్. ఆస్ట్రియన్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఈ 390 అడ్వెంచర్ దాని 390 డ్యూక్ మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ మరియు అనేక ఇతర ఫీచర్లు మరియు పరికరాలను పంచుకుంటుంది.

మార్కెట్లో కెటిఎమ్ 390 అడ్వెంచర్ ప్రారంభ ధర రూ.3.04 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఇది స్టైల్, పెర్ఫార్మెన్స్ మరియు ఆఫ్-రోడ్ సామర్ధ్యాల అద్భుతమైన కలయికను అందిస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యంత ఆకర్షణీయమైన అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలుస్తుంది.

బిఎస్6 బిఎమ్‌డబ్ల్యూ జి 310
బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేసిన జి 310 ఆర్ (నేకెడ్ స్ట్రీట్ ఫైటర్) మరియు జి 310 జిఎస్ (అడ్వెంచర్-టూరర్) ఈ ట్విన్ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు బిఎస్-6 కంప్లైంట్ ఇంజన్‌తో పాటుగా అనేక ఇతర అప్‌గ్రేడ్‌లను కూడా అందుకున్నాయి.

అంతేకాకుండా, బిఎమ్‌డబ్ల్యూ ఈ రెండు మోటార్‌సైకిళ్ల ధరలను కూడా బాగా తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మోడల్‌ను రూ.2.45 లక్షలకు మరియు జి 310 జిఎస్ మోడల్‌ను రూ.2.85 లక్షలకు విక్రయిస్తున్నారు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఈ రెండు మోడళ్లలో అప్‌డేట్ చేయబడిన గ్రాఫిక్స్ మరియు పెయింట్ స్కీమ్‌లతో పాటుగా కొత్త బిఎస్6 కంప్లైంట్ 312 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 34 బిహెచ్‌పి పవర్‌ను మరియు 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 మోడల్ నుండి గ్రహించారు.

ట్రైయంప్ టైగర్ 900
ట్రైయంప్ టైగర్ 900ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు, ఇది టైగర్ 800 మోడల్ రీప్లేస్ చేస్తుంది. మార్కెట్లో కొత్త ట్రైయంప్ టైగర్ 900 ధర రూ.13.7 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

కొత్త ట్రైయంప్ టైగర్ 900లో శక్తివంతమైన 888సిసి త్రీ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్‌ను మరియు 87 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్, హెవీవెయిట్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. ఇందులోని సరికొత్త 1800 సిసి బాక్సర్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్‌ను మరియు 158 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ స్టాండర్డ్ మరియు ఫస్ట్ ఎడిషన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.18.90 లక్షల మరియు రూ.21.40 లక్షలుగా ఉన్నాయి రెండు ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా).