2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

మనమందరూ ఇప్పుడు 2020 చివరి నెలకు చేరుకున్నాము. ఈ 2020 సంవత్సరంలో అనేక స్కూటర్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బైకుల కంటే స్కూటర్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు స్కూటర్లలో కూడా మంచి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి, ఇటుబంతి కొత్త అప్డేటెడ్ ఫీచర్ల వల్ల స్కూటర్లు ఎక్కువ ఆకర్శించబడుతున్నాయి.

2020 లో అమ్మకాలు పరంగా అగ్రస్థానంలో ఉన్న స్కూటర్ల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

1. హోండా యాక్టివా 6 జి :

హోండా యాక్టివా స్కూటర్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్. ఈ స్కూటర్ 110 సిసి మరియు 125 సిసి వేరియంట్లలో వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా హోండా యాక్టివా అమ్మకాలు బాగా పెరిగాయి. 125 సిసి యాక్టివా యొక్క ఆరవ తరం మోడల్‌ను కంపెనీ ఈ ఏడాది విడుదల చేసింది. యాక్టివా 6 జి ప్రారంభ ధర రూ. 67,515 కాగా, టాప్ మోడల్ ధర రూ. 70,515 (ఎక్స్-షోరూమ్).

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

ఆక్టివా 6 జి ఈ సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన 125 సిసి స్కూటర్ విభాగంలో ఒకటిగా నిలిచింది. ఈ స్కూటర్‌లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. యాక్టివా 6 జిలో మొబైల్ ఛార్జర్ అందించబడుతోంది, అంతే కాకుండా ఇందులో అండర్-సీట్ స్టోరేజ్ కూడా పెంచబడింది. బిఎస్ 6 ఇంజిన్‌తో, స్కూటర్ యొక్క మైలేజ్ మరియు శక్తిని కూడా పెంచారు.

MOST READ:మహిళా రైడర్స్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ ; వివరాలు

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

ఈ నెల హోండా యాక్టివా భారతదేశంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాక్టివా 6 జి యొక్క యానివెర్సరీ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన గోల్డెన్ బ్రౌన్ పెయింట్‌లో లాంచ్ చేయబడింది.

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

2. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ :

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టీవీఎస్ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. బైక్ సెగ్మెంట్ నుండి ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టుపై కూడా సంస్థ దృష్టి సారించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకతను గ్రహించిన టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో పోటీ రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఒకినావా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి అనేక ఇతర కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే తయారు చేస్తున్నాయి.

MOST READ:జపాన్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా ఆర్ 3 బైక్, భారత్‌కు వస్తుందా..?

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

అందువల్ల ఈ కంపెనీలతో పోటీలో ఉంటడానికి టీవీఎస్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టింది. టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ. 1.15 లక్షలు (ఆన్ రోడ్, బెంగళూరు). ఈ స్కూటర్ పూర్తి ఛార్జీతో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేక్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

3. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ :

బజాజ్ తన పాత స్కూటర్ బ్రాండ్ అయినా చేతక్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్లలో విడుదల చేసింది. బజాజ్ చేతక్ ప్రీమియం రెట్రో స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ప్రీమియం మరియు అర్బన్ అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. చేతక్ ప్రీమియం ధర రూ. 1,21,52 (ఎక్స్-షోరూమ్) కాగా, అర్బన్ ధర 1,06,445 రూపాయలు (ఎక్స్-షోరూమ్).

MOST READ:గురుగ్రామ్‌లో 55 శాతం తగ్గిన ట్రాఫిక్ ఫైన్స్.. దీనికి కారణం ఇదే

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

4. ఏథర్ 450 ఎక్స్ :

ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ ఐ క్యూబ్, బజాజ్ చేతక్ కంటే ఎక్కువ అమ్ముతోంది. దీనికి కారణం దాని ప్రత్యేకమైన డిజైన్ మరియు ఫీచర్స్. ఏథర్ దేశంలో డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరిస్తోంది. గత నెలలో ఏథర్ 16 కొత్త డీలర్‌షిప్‌లను ఓపెన్ చేసింది. ఏథర్ 450 స్కూటర్లు, ఏథర్ 450 ప్లస్ మరియు ఏథర్ 450 ఎక్స్ అనే రెండు మోడళ్లను కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. రెండు స్కూటర్ల యొక్క పవర్ మరియు పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

ఏథర్ యొక్క ఈ రెండు స్కూటర్లు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటాయి. ఏథర్ 450 స్కూటర్ 350 సిసి బైక్‌తో సమానమైన 26 ఎన్ఎమ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6.50 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది. కంపెనీ తన స్కూటర్ల బ్యాటరీపై 3 సంవత్సరాల అపరిమిత వారంటీని అందిస్తుంది.

MOST READ:మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

5. వెస్పా రేసింగ్ సిక్స్‌టీస్ :

బజాజ్ చేతక్ మాదిరిగా, పియాజియో వెస్పా బ్రాండ్‌ను పునరుద్ధరించింది. వెస్పా స్కూటర్లకు కొత్త ఫీచర్లతో పాత రెట్రో లుక్ ఇచ్చారు. వెస్పా రేసింగ్ సిక్స్‌టీస్ లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రారంభించబడింది. వెస్పా రేసింగ్ సిక్స్‌టీస్ 125 సిసి వేరియంట్‌ను రూ. 1.20 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో విడుదల చేశారు. అదే సమయంలో, దాని 150 సిసి వేరియంట్ ధరను రూ. 1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేశారు.

2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

ఈ స్కూటర్‌ను సిక్స్‌టీస్ కి చెందిన స్కూటర్ల మాదిరిగా ఇవ్వడానికి కంపెనీ ప్రయత్నించింది. వెస్పా రేసింగ్ సిక్స్‌టీస్ ఎడిషన్‌లో ఎల్‌ఈడీ స్ప్లిట్ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్‌బ్రేక్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. పియాజియో వెస్పా కప్ ఎలక్ట్రిక్ ఎడిషన్‌లో కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ ఎడిషన్ కూడా లాంచ్ అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Most Read Articles

English summary
Top 5 Scooter Launches In India In 2020 Honda Activa TVS Iqube, Bajaj Chetak And More. Read in Telugu.
Story first published: Friday, December 18, 2020, 20:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X