పెరగనున్న ట్రైయంప్ బోన్‌విల్ రేంజ్ మోటార్‌సైకిళ్ల ధరలు - వివరాలు
ట్రైయంప్ మోటార్‌సైకిల్ ఇండియా తమ బోన్‌విల్ సిరీస్‌లో విక్రయిస్తున్న మొత్తం రేంజ్ ధరలను పెంచాలని యోచిస్తోంది. బోన్‌విల్ సిరీస్ భారత మార్కెట్లో ట్రైయంప్ పోర్ట్‌ఫోలియో నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. ఈ శ్రేణిలో స్ట్రీట్ ట్విన్, బోన్‌విల్ టి100, బోన్‌విల్ టి120 మరియు బోన్‌విల్ స్పీడ్ మాస్టర్ మోడళ్లు ఉన్నాయి, ఇవన్నీ సరికొత్త బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడినవి.

తాజాగా హెచ్‌టి ఆటో నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ఆగస్టు నెలలో మొత్తం ట్రైయంప్ బోన్‌విల్ శ్రేణి ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాస్తవానికి ఈ జూలై నెలలోనే ట్రైయంప్ వీటి ధరలను పెంచాలని నిర్ణయించింది, కానీ దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది.

ట్రైయంప్ ఇండియా సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తమ సరికొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోటార్‌సైకిల్‌ను రూ.11.13 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరకు విడుదల చేసింది. కానీ, ఇటీవలే కంపెనీ ఈ కొత్త 2020 ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌పై రూ.20,000 ధరల పెంపును ప్రకటించింది. ఈ కొత్త మోటారుసైకిల్ అనేక పరికరాలు, ఫీచర్లు, ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ మరియు అప్‌గ్రేడెడ్ ఇంజన్‌తో లభిస్తుంది.

ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో అందంగా కనిపించే ట్విన్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, రివైజ్డ్ బెల్లీ పాన్ మరియు రీడిజైన్ చేసిన ఫ్యూయల్ ట్యాంక్ వంటి మార్పులు ఉన్నాయి. వెనుక విభాగంలో కూడా కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోటార్‌సైకిల్‌లో 765 సిసి ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11,750 ఆర్‌పిఎమ్ వద్ద 121.36 బిహెచ్‌పి శక్తిని మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 79 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు టూ-వే క్విక్‌షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది.

కాగా, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోడల్‌కు దిగువన కొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోడల్‌ను కూడా భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ ధృవీకరించింది. ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్‌లో కూడా అదే 765 సిసి, ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ (ఆర్ఎస్ మోడల్‌లో ఉపయోగించే ఇంజన్)ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 116 బిహెచ్‌పి శక్తిని మరియు 77 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ట్రైయంప్ బోన్‌విల్ మోటార్‌సైకిళ్ల ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, బోన్‌విల్ భారతదేశంలో ట్రైయంప్ పోర్ట్‌ఫోలియో నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్. మోడ్రన్ టచ్, క్లాసిక్ లుక్‌లో కనిపించే ఈ మోటార్‌సైకిళ్ళు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కాబట్టి వీటిని కొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు స్వల్ప ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందరనేది మా అభిప్రాయం.


Click it and Unblock the Notifications








