ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంప్ భారత విపణిలో రెండు సరికొత్త స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న ట్రయంప్ బోన్‌విల్ టి100 మరియు టి120 మోడళ్లలో బ్లాక్ ఎడిషన్ పేరిట రెండు కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

- ట్రయంప్ బోన్‌విల్ టి100 బ్లాక్ ఎడిషన్ - 8.87 లక్షలు
- ట్రయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ - 9.97 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

పేరుకు తగినట్లుగానే ఈ రెండు మోడళ్లు కూడా పూర్తి బ్లాక్డ్-అవుట్ (నలుపు రంగు) ఫినిష్‌తో వస్తాయి. మోడ్రన్ క్లాసిక్ లుక్ కలిగిన ఈ రెండు ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు రెగ్యులర్ వెర్షన్లతో పోల్చుకుంటే భిన్నంగా కనిపిస్తూ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటాయి.

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లలో రియర్ వ్యూ మిర్రర్స్, హెడ్‌ల్యాంప్ బెజెల్స్, టర్న్ ఇండికేటర్స్, ఇంజన్, వీల్స్ మరియు బాడీ వర్క్ మొత్తం కూడా బ్లాక్ ఫినిషింగ్‌తో ఉంటుంది. బోన్‌విల్ టి 100 బ్లాక్ ఎడిషన్ మ్యాట్ బ్లాక్ లేదా గ్లాసీ బ్లాక్ పెయింట్ ఆప్షన్లలో లభిస్తుంది. బోన్‌విల్ టి 120 బ్లాక్ ఎడిషన్ మాత్రం మ్యాట్ గ్రాఫైట్ ఫినిష్‌లో లభిస్తుంది. ఈ కలర్ స్కీమ్‌ల వలనే ఇవి మిగతా వేరియంట్ల కన్నా భిన్నంగా, మరింత ఘనంగా కనిపిస్తాయి.

MOST READ: హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే ?

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

పైన పేర్కొన్న మార్పులు మినహా ఈ రెండు మోటార్‌సైకిళ్లలో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ట్రయంప్ బోన్‌విల్ టి 100 బ్లాక్ ఎడిషన్‌లోని 900 సీసీ పారలల్ ట్విన్ ఇంజన్ గరిష్టంగా 5,400 ఆర్‌పిఎమ్ వద్ద 54 బిహెచ్‌పిల శక్తిని, 3,230 ఆర్‌పిఎమ్ వద్ద 84 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఇకపోతే ట్రయంప్ బోన్‌విల్ టి 120 బ్లాక్ ఎడిషన్‌లోని 1200 సీసీ పారలల్ ట్విన్ ఇంజన్ గరిష్టంగా 6,550 ఆర్‌పిఎమ్ వద్ద 79 బిహెచ్‌పిల శక్తిని, 3,100 ఆర్‌పిఎమ్ వద్ద 84 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

MOST READ: సురక్షితమైన ప్రయాణానికి శానిటైజ్ క్యాబ్ సర్వీస్, ఇదే

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

స్టాండర్డ్ వేరియంట్ బోన్‌విల్ మోటార్‌సైకిళ్లలోని అన్ని ఫీచర్లు ఈ స్పెషల్ ఎడిషన్లలోనూ ఉంటాయి. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, రైడ్-బై-వైర్, డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, క్లాసిక్ ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్‌లు మినహా మరో కొత్త మోటార్‌సైకిల్ 'స్ట్రీట్ ట్రిపుల్ ఆర్'ను భారత మార్కెట్లో త్వరలోనే విడుదల చేస్తామని ట్రయంప్ ప్రకటించింది. ట్రయంప్ ఇటీవలే విడుదల చేసిన 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోడల్ (రూ.11.13 లక్షలు, ఎక్స్-షోరూమ్)కు దిగువన ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను ప్రవేశపెట్టనున్నారు.

MOST READ: ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

ట్రయంప్ బోన్‌విల్ బ్లాక్ ఎడిషన్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు వివరాలు

ట్రయంప్ బోన్‌విల్ టి 100 , టి 120 బ్లాక్ ఎడిషన్ మోడళ్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రయంప్ విడుదల చేసిన బోన్‌విల్ టి 100 , టి 120 బ్లాక్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లకి స్టాండర్డ్ వెర్షన్ బోన్‌విల్ టి 100 , టి 120 మోటార్‌సైకిళ్లకి పెయింట్ థీమ్ మినహా మిగిలిన అన్ని ఇతర ఫీచర్లు యధావిధిగా ఉన్నాయి. అందరిలో కెల్లా ప్రత్యేకమైన మరియు విశిష్టమైన లుక్ అండ్ ఫీల్ కావాలనుకునే వారికి ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌లు మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
Triumph Motorcycles have launched the Black-Edition versions of the T100 & T120 models in its Bonneville range. The Triumph Bonneville T100 Black Edition and T120 Black Edition are priced at Rs 8.87 lakh and Rs 9.97 lakh, respectively. Both prices are ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X