గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ద్విచక్రవాహన తయారీలో ప్రసిద్ధి చెందిన సంస్థ ట్రయంఫ్ ఇండియా ఇటీవల తన బ్రాండ్ అయిన 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు ట్రయంఫ్ మరో కొత్త బైక్ ని ప్రవేశపెట్టనుంది. ట్రయంఫ్ ప్రవేశపెట్టనున్న స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

స్పోర్ట్ నేకెడ్ బైక్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ బైక్‌కు ముందు లాంచ్ చేయాల్సి ఉంది. కానీ భారతదేశంలో కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా ఈ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ విడుదలను వాయిదా వేసింది. మిడ్-స్పెక్ వేరియంట్, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను విడుదల చేయడానికి కంపెనీ ఇప్పుడు సన్నద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది జూన్‌లో స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను భారత్‌లో లాంచ్ చేసే అవకాశాలున్నాయి.

గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ఈ మిడిల్‌వెయిట్ నేకెడ్ బైక్ ఇటీవల ప్రారంభించిన ఆర్‌ఎస్ వెర్షన్ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రాబోయే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ అనలాగ్ టాకోమీటర్‌తో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ముందు భాగంలో 41 మిమీ షోవా అప్‌సైడ్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనో-షాక్‌తో అమర్చబడి ఉంటుంది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గమనించినట్లయితే దీని ముందు భాగంలో ట్విన్ 310 ఎంఎం డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్ అమర్చారు. ఇది డ్యూయెల్-ఛానల్ ఎబిఎస్ తో జత చేయబడింది.

గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ఈ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ లో 765 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 12,000 ఆర్పిఎమ్ వద్ద 116 బిహెచ్‌పి శక్తిని మరియు 9,400 ఆర్పిఎమ్ వద్ద 77 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

MOST READ:కరోనా నివారణలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా హర్యానా, ఇంతకీ ఏం చేసిందో తెలుసా..?

గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ కఠినమైన రూపాన్ని కలిగి ఉంది. 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌లో ఇంటిగ్రేటెడ్ ట్విన్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో 765 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 121 బిహెచ్‌పి శక్తిని, 79 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

మిడిల్‌వెయిట్ సెగ్మెంట్ బైక్‌లకు ఎక్కువ డిమాండ్ ఉన్న కారణంగా ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ అయినా తరువాత ఇది కెటిఎం 790 డ్యూక్ బైక్‌కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

MOSDT READ:బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ : ధర & ఇతర వివరాలు

Most Read Articles

Read more on: #triumph motorcycles
English summary
Triumph Is Likely To Launch The Street Triple R Soon In India. Read in Telugu.
Story first published: Saturday, April 25, 2020, 10:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X