పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

ట్రయంప్ మోటార్‌సైకిల్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ (Triumph Street Triple RS) బైక్‌ను కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ బైక్ భారత మార్కెట్లో రూ.11.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు అమ్ముడవుతోంది. అయితే, త్వరలోనే ఈ మోడల్ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

కొత్త 2020 ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. సరికొత్త ఫీచర్లు మరియు పూర్తిగా రీవర్క్ చేయబడిన ఇంజన్‌తో ఇది లభిస్తుంది. వచ్చే జులై నుంచి ఈ బైక్ ధరలను రూ.50,000 వరకూ పెంచేందుకు ట్రయంప్ సన్నాహాలు చేస్తోంది. జూన్ 30 లోపుగా ఈ బైక్‌ను కొనుగోలు చేసేవారికి ప్రస్తుత ధరలే వర్తిస్తాయి.

పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

రివైజ్ చేయబడిన పవర్‌ఫుల్ ఎల్ఈడి హెడ్‌లైట్స్, రీడిజైన్ చేసిన సన్నటి డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్స్, స్లీక్ అండ్ షార్ప్ లుక్ కలిగిన వెనుక బాడీ డిజైన్, ఆకర్షనీయమైన ఫ్రేమ్ డిజైన్ మరియు స్టయిలిష్ ఫ్యూయెల్ ట్యాంక్ సైడ్ కవర్స్, పూర్తి టచ్‌స్క్రీ సామర్థ్యంతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, కొత్త పెయింట్ స్కీమ్స్‌తో 2020 ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ లభిస్తుంది.

పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

ఇదివరకు చెప్పుకున్నట్లుగా కొత్త 2020 ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా రివైజ్ చేయబడిన 765సీసీ ఇన్-లైన్ 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈఇంజన్ గరిష్టంగా 11,750 ఆర్‌పిఎమ్ వద్ద 121 బిహెచ్‌పిల శక్తిని, 9,350 ఆర్‌పిఎమ్ వద్ద 79 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని క్లచ్ మరియు గేర్ షిఫ్టింగ్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

ఇదిలా ఉంటే.. ట్రయంపై ప్రస్తుతం విక్రయిస్తున్న 2020 ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌కు దిగువ మరింత తక్కువ ధరలో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ (Triumph Street Triple R) పేరుతో ఈ మోడల్ విడుదల కానుంది. ఈ ఏడాదిలోనే ఇది భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

కొత్త ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌లో 765 సీసీ 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 116 బిహెచ్‌పిల శక్తిని, 9,400 ఆర్‌పిఎమ్ వద్ద 77 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో కూడా స్లిప్-అసిస్ట్ (జారిపోకుండా ఉండే) క్లచ్ ఉంటుంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

పెరగనున్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధరలు - వివరాలు

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర పెరగటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రయంప్ అందిస్తున్న స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోటార్‌సైకిల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైంది, ఇందులోని టెక్నాలజీ ఫీచర్లు రైడర్‌కు బైక్ రైడింగ్ సమయంలో మరింత సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తాయి. ఈ కొత్త బైక్ ఈ సెగ్మెంట్లోని కవాసకి జీ900, కెటిఎమ్ 790 డ్యూక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 13, 2020, 13:03 [IST]
English summary
Triumph Motorcycles India recently launched the much-awaited 2020 Street Triple RS in the Indian market. The motorcycle has been priced at Rs 11.13 lakh, ex-showroom (India). The new Street Triple RS comes with a host of new features, added equipment and a completely reworked engine as well. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+