Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌కు ట్రైయంప్ నుంచి మరో కొత్త బైక్; రాకెట్ 3జిటి
బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ భారత మార్కెట్ కోసం మరో సరికొత్త మోడల్‌ను తీసుకురానుంది. ట్రైయంప్ రాకెట్ 3 జిటి పేరిట ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని ట్రైయంప్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ని కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ 10, 2020వ తేదీన ట్రైయంప్ రాకెట్ 3జిటి భారత్‌లో విడుదల కానుంది.

ట్రైయంప్ రాకెట్ 3 జిటి భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది ట్రైయంప్ మోటార్‌సైకిల్ యొక్క ఇండియన్ ప్రొడక్ట్ లైనప్‌లో బ్రాండ్ నుండి లభ్యం కానున్న ప్రధాన మోడల్‌గా మారుతుంది.

ట్రైయంప్ రాకెట్ 3 జిటి విషయానికి వస్తే, ఇది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమవుతోన్న మోడల్లో అందిస్తున్న ఫీచర్లు, పరికరాలను ఇండియా-స్పెక్ మోడల్లో కూడా కొనసాగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ట్రైయంప్ రాకెట్ 3 జిటి బ్రాండ్ నుండి లభిస్తున్న అల్టిమేట్ మైల్ మంచర్ అండ్ గ్రాండ్ టూరర్గా ఉంటుందని కంపెనీ తెలిపింది.
MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

ట్రైయంప్ రాకెట్ 3 జిటి మోటార్‌సైకిల్ టూరింగ్ సామర్థ్యానికి తోడ్పడటం కోసం కంపెనీ ఈ జిటి వేరియంట్‌కు కొన్ని ముఖ్యమైన ఫీచర్లను జోడించింది. ఇందులో ప్రధానంగా రైడ్ కంఫర్ట్ కోసం డిజైన్ చేసిన విస్తృతమైన హ్యాండిల్‌బార్ మరియు కంఫర్టబల్ రైడర్, పిలియన్ రైడర్ సీట్స్‌ను చెప్పుకోవచ్చు.

రాకెట్ 3 జిటిలో రెండు దశల హీటింగ్ సామర్థ్యంతో కూడిన హీటెడ్ గ్రిప్స్, 20 ఇంచ్ స్పోక్డ్ అల్లాయ్ వీల్స్, వెల్ కుషన్డ్ రైడర్ మరియు పిలియన్ సీట్ మరియు పిలియన్ రైడర్‌కు ఎత్తు-సర్దుబాటు చేయగల బ్యాక్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇతర ఫీచర్లలో మెరుగైన వెథర్ ప్రొటెక్షన్ కోసం విస్తరించబడిన ఫ్లైస్క్రీన్, రైడర్ కోసం సర్దుబాటు చేయగల ఫుట్‌పెగ్‌లు మరియు పిలియన్ రైడర్ కోసం ఫోల్డబిల్ ఫుట్‌రెస్ట్‌లు కూడా ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లోని వైరింగ్ మొత్తాన్ని పూర్తిగా ఇంటర్నల్‌గానే ఉంటుంది, కాబట్టి ఇది మోటార్సైకిల్లు స్పష్టమైన రూపాన్ని ఇస్తుంది.

ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్లతో కూడిన సిగ్నేచర్ ట్విన్ ఎల్ఈడి-హెడ్‌ల్యాంప్‌లు, మరియు మజిక్యులర్ 18-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, సెంట్రల్ రీసెస్, బ్రష్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ స్ట్రాప్ ఉంటాయి. అంతేకాకుండా, బ్రష్ చేసిన అల్యూమినియం మోన్జా తరహా ఫ్యూయెల్-ట్యాంక్ లిడ్, ఆయిల్ క్యాప్, కూలెంట్ క్యాప్ మరియు ఎయిర్-బాక్స్ కవర్ కూడా ఉన్నాయి. ఇందులోని 3-ఇన్ -1 స్టెయిన్లెస్ ఎగ్జాస్ట్ పైప్ బైక్‌కు ఆకట్టుకునే రూపాన్ని ఇస్తుంది.
MOST READ:హవ్వ.. 23 కోట్ల రూపాయలకు అమ్ముడైన 54 ఏళ్ల పాత ఫెరారీ కారు

ట్రైయంప్ రాకెట్ 3 జిటిలో ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్‌తో పాటుగా ఇన్స్ట్రుమెంటేషన్ కోసం టిఎఫ్టి డిస్ప్లే కూడా ఉంటుంది. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ (రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ కస్టమ్) ఉంటాయి. ఇంకా, డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఎన్నో రైడర్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

రాకెట్ 3 జిటిలో 2,458 సిసి ఇన్లైన్-త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉఫయోగించారు. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 165 బిహెచ్పి పవర్‌ను మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా

ఇందులోని మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో పాక్షికంగా సర్దుబాటు చేయగల 47 మిమీ యుఎస్డి కార్ట్రిడ్జ్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో పూర్తిగా సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ రెండింటిన షోవా బ్రాండ్ నుంచి గ్రహించారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు ట్విన్ 320 మిమీ డిస్క్‌లను మరియు వెనుకవైపు ఒకే 300 మిమీ డిస్క్‌ను ఉపయోగించారు. ఈ రెండింటినీ బ్రెంబో నుండి గ్రహించారు.

ఈ మోటార్‌సైకిల్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: ఫాంటమ్ బ్లాక్, స్లివర్ ఐస్ మరియు స్ట్రోమ్ గ్రే డ్యూయెల్-టోన్. మరిన్ని వివరాలు విడుదల సమయంలో తెలిసే అవకాశం ఉంది.

ట్రైయంప్ రాకెట్ 3 జిటి మోటార్‌సైకిల్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ట్రైయంప్ మోటార్‌సైకిల్ భారత మార్కెట్ కోసం మరిన్ని కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో తమ ప్రోడక్ట్ లైనప్‌ను విస్తరించుకోవాలని చూస్తోంది. ట్రైయంప్ రాకెట్ 3 జిటి సుదూర ప్రయాణాలకు అనుగుణంగా మెరుగైన రైడర్ మరియు పిలియన్ ఎర్గోనామిక్స్ అందించే మోటార్‌సైకిల్.