ఇండియాలో ప్రారంభమైన ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ మోటార్ సైకిల్స్ డెలివరీలు
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన ప్రధాన మోటార్‌సైకిల్, రాకెట్ 3 ఆర్ ను ఇండియన్ మార్కెట్లో డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ గత నెలలో భారతదేశంలో లాంచ్ చేయబడింది. దీని ధర రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ బుకింగ్స్, ట్రయంఫ్ రాకెట్ లాంచ్ చేసిన సమయంలోనే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రాకెట్ 3 ఆర్ మోటారుసైకిల్లను దశల వారీగా డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే మొదట డెలివరీలను ఎనిమిది నగరాల్లో మాత్రమే ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. అవి బెంగుళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, కొచ్చి, చండీఘర్, పూణే, ఢిల్లీ మరియు ముంబై నగరాలు.

రాకెట్ 3 ఆర్ మోటారుసైకిల్ యొక్క రెండవ బ్యాచ్ యొక్క డెలివరీలు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో ప్రారంభమవుతాయని ట్రయంఫ్ కంపెనీ ప్రకటించింది. రాకెట్ 3 ఆర్ అనేది భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్.

ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా జనరల్ మేనేజర్ షూబ్ ఫారూక్ మాటాడుతూ, రాకెట్ 3 ఆర్ యొక్క డెలివరీలను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ మోటార్ సైకిల్స్ కి దేశంలో మంచి స్పందన వచ్చింది. ఇండియాలో ఇప్పుడు రాకెట్ 3 ఆర్ యొక్క మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది. తర్వాతా డెలివరీలు కూడా నిర్దిష్టమైన సమయంలో అందించడానికి కృషి చేస్తాము అన్నారు.

కొత్త 2020 ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ 2500 సిసి త్రీ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్పిఎమ్ వద్ద 165 బిహెచ్‌పి మరియు 4000 ఆర్పిఎమ్ వద్ద 221ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

అంతర్జాతీయంగా, ట్రయంఫ్ రాకెట్ 3 ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. అవి రాకెట్ 3 ఆర్ మరియు రాకెట్ 3 జిటి. అయితే బ్రిటిష్ బ్రాండ్ భారత మార్కెట్లో కేవలం ‘3 ఆర్' వేరియంట్‌ను మాత్రమే ప్రవేశపెట్టింది. 2020 ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ లో కూడా కోరోసి రెడ్ మరియు ఫాంటమ్ బ్లాక్ అనే రెండు రంగుల ఎంపికలలో అందించబడుతుంది.

దీనిలోని ఫీచర్స్ ని గమనించినట్లయితే ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, టైల్లైట్స్, టార్క్-అసిస్టెడ్ క్లచ్, హీటెడ్ గ్రిప్స్, ఎక్స్‌టెండెడ్ ఫ్లై స్క్రీన్, సర్దుబాటు చేయగల ఫుట్‌పెగ్‌లు మరియు హోస్ట్ లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన బ్రిటిష్ బ్రాండ్ నుండి వచ్చిన తాజా ఫ్లాగ్‌షిప్ ఆఫర్. రాకెట్ 3 ఆర్ ప్రొడక్షన్-స్పెక్ మోటార్‌సైకిల్ అతిపెద్ద డిస్ప్లేస్‌మెంట్ ఇంజిన్‌తో వస్తుంది. దీనియొక్క 2500 సిసి ఇంజిన్ కి భారత మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు.


Click it and Unblock the Notifications








