ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ తాజాగా తమ సరికొత్త టైగర్ 850 స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఈ శ్రేణిలో బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌గా రానుంది. ఈ మోటారుసైకిల్ కూడా రోడ్-ఓరియెంటెడ్ అడ్వెంచర్-టూరర్‌గా ఉంటుంది. ఇది కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన టైగర్ 900 మోడల్‌కు దిగువన బేస్-లెవల్ వేరియంట్‌గా అందుబాటులోకి రానుంది.

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

డిజైన్ పరంగా గమనిస్తే, కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ దాని బిగ్ బ్రదర్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఈ రెండింటి మధ్య తేడా కోసం కంపెనీ కొత్త టైగర్ 850కి ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్, రెండు కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్స్ (గ్రాఫైట్ / డయాబ్లో రెడ్ మరియు గ్రాఫైట్ / కాస్పియన్ బ్లూ)ను జోడించింది.

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

ఇందులోని ఫ్రంట్ బీక్, సర్దుబాటు చేయగల విండ్‌షీల్డ్, ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ ష్రుడ్ మరియు ఎల్‌ఈడి లైట్స్ మరియు బాడీ ప్యానెళ్లను ట్రైయంప్ టైగర్ 900 మోడల్ నుండి గ్రహించారు. కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్‌ను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవటం కంపెనీ అనేక రకాల యాక్ససరీలను కూడా అందిస్తోంది.

MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ అదే 888సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్-లైన్ త్రీ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 82 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది టైగర్ 900 కన్నా 10 బిహెచ్‌పి మరియు 5 ఎన్ఎమ్ తక్కువగా ఉంటుంది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

టైగర్ 850 స్పోర్ట్‌లోని ఇంజన్ కొద్దిగా డీట్యూన్ చేయబడినదని ఫలితంగా మరింత లీనియర్ పవర్ డెలివరీని అందిస్తుందని మరియు ఇది చాలా తేలికైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందని ట్రైయంప్ పేర్కొంది. ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ రెండు రైడింగ్ మోడ్‌లతో (రెయిన్ అండ్ రోడ్) లభిస్తుంది. ఈ మోడ్స్‌ని సెలక్ట్ చేసుకోవటం కోసం క్విక్-షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంటుంది.

MOST READ:ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలవనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 [డ్రైవ్ వీడియో]

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

ఈ మోటారుసైకిల్ ముందు భాగంలో 43 మిమీ తలక్రిందులుగా ఉన్న (అప్‌సైడ్ డౌన్) ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ రెండింటినీ మార్జోచి బ్రాండ్ నుండి గ్రహించారు. ఫ్రంట్ సస్పెన్షన్ 180 మిమీ ట్రావెల్‌తో వస్తుంది అలాగే, వెనుకవైపు సస్పెన్షన్ 170 మిమీ మాన్యువల్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో లభిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో రెండు 320 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒకే 255 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి రెండూ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ చేస్తాయి.

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ 100 -90 మరియు 150/70 టైర్ ప్రొఫైల్‌లతో 19-ఇంచ్ ఫ్రంట్ ముందు మరియు 17ఇంచ్ రియర్ అల్లాయ్ వీల్స్‌ని కలిగి ఉంటుంది. కొత్త టైగర్ 850 స్పోర్ట్, టైగర్ 900 జిటి మోడల్ కంటే 2 కిలోల తేలికగా ఉండి, 810 మిమీ వద్ద కొంచెం తక్కువ సీటు ఎత్తును కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు మరియు ఇది లీటరుకు 19.23 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఆవిష్కరణ; 2021లో ఇండియా లాంచ్

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విక్రయించబడుతుందని అంచనా. కొత్త టైగర్ 850 స్పోర్ట్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టైగర్ 900 మోడల్ ధర కన్నా తక్కువగా ఉంటుందని సమాచారం. మార్కెట్లో ప్రస్తుతం ట్రైయంప్ టైగర్ 900 ధర రూ .13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
Triumph Motorcycles have unveiled the Tiger 850 Sport globally. The new Triumph Tiger 850 Sport will be the brand's new entry-level model in the range. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X